Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర, స్థిరంగా వెండి.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, […]
Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినట్టుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా కూడా ఏదో తక్కువగా తగ్గి ఎక్కువగా ధరలు పెరుగుతున్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్న కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇవాళ కూడా మరోసారి బంగారం ధరలు పెరగగా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
ఒక గ్రాము బంగారం ధర ఇవాళ 22 క్యారెట్లకు రూ.4765 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.150 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఇవాళ రూ.5198 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.16 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.160 పెరిగింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,800 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,140 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,030 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.55.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల వెండి ధర ఇవాళ రూ.554 గా ఉంది. కిలో వెండి ధర రూ.55,400 గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.613 కాగా, కిలో వెండి ధర రూ.61300 గా ఉంది.