Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి.. పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, […]
Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినట్టుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా కూడా ఏదో తక్కువగా తగ్గి ఎక్కువగా ధరలు పెరుగుతున్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు రెండూ తగ్గాయి. నిన్న బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి. ఇవాళ కూడా బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి.
ఇవాళ బంగారం ధరలు 22 క్యారెట్లకు ఒక గ్రాము ధర రూ.4640 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.100 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఇవాళ రూ.5062 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.50,620 గా ఉంది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,220 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.52.30 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 70 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.523 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.7 పెరిగింది. కిలో వెండి ధర రూ.52,300 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ700 పెరిగింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.580 కాగా, కిలో వెండి ధర రూ.58000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.523 కాగా, కిలో వెండి ధర రూ.52300 గా ఉంది.