Toll Plaza : హైవే ‘టోల్’ ఇక జీవితాంతం తప్పదా..?
Toll Plaza : దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పెద్ద మొత్తంలో హైవేలపై టోల్ గేట్ల వద్ద టోల్ రుసుము వసూళ్లు చేస్తున్నారు. హైవేల విస్తరణ మరియు వాటి మెయింటనెన్స్ కోసం ప్రైవేట్ సంస్థలు టోల్ వసూళ్లు చేస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలు పెట్టిన పెట్టుబడి వసూళ్లు అయ్యే వరకు అన్నట్లుగా కొన్నేళ్ల వరకు టోల్ ఫీజును వారు వసూళ్లు చేసుకునేలా ప్రభుత్వంతో ఒప్పందం ఉంటుంది. ఎప్పుడైతే ఆ సంస్థ తాము పెట్టిన నిధులకు సరిపోను డబ్బు ను టోల్ ద్వారా వెనక్కు రాబట్టుకోగలిగిందో ఎప్పుడైతే కాంట్రాక్ట్ పూర్తి అవుతుందో అప్పటి వరకు వసూళ్లు చేస్తారు. ఆ తర్వాత టోల్ గేట్లు ఉండవని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాని జీవితాంతం టోల్ ఉంటుందని కేంద్ర మంత్రి గడ్కారి క్లారిటీ ఇచ్చాడు.
Toll Plaza : ఫాస్ట్ ట్యాగ్ వల్ల రూ.20 వేల కోట్లు ఆదా, రూ.10 వేల కోట్ల ఆదాయం..
ప్రతి టోల్ గేట్ వద్ద ఫాస్ట్ ట్యాగ్ లను ఏర్పాటు చేసి తప్పనిసరిగా వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే దాదాపుగా 85 శాతం నుండి 90 శాతం వాహన దారులు ఫాస్ట్ ట్యాగ్ ను తీసుకున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఈ ఫాస్ట్ ట్యాగ్ వల్ల ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్ల ఇందనం ఆదా అవుతుందని మంత్రి పేర్కొన్నారు. టోల్ గేట్ వద్ద ఎదురు చూపులు లేకపోవడం వల్ల ఈ ఇందనం ఆదా అవుతుందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. సమయం వృదా తగ్గుతున్న కారణంగా ఏడాదికి కనీసం రూ.10 వేల కోట్లు అయినా ఆదాయం పెరుగుతుందని అన్నారు. ఫాస్ట్ ట్యాగ్ ను మిగిలిన వారు కూడా తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
టోలు జీవితాంతం తప్పదు..
టోల్ గేట్ల వద్ద రుసుము వసూళ్లు ఎప్పటికి కొనసాగుతూనే ఉంటుందని, టోల్ ఫీజు ఎత్తి వేయడం అనేది జరగదు అంటూ ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థలు టోల్ గేట్లను వదిలేసిన తర్వాత వాటిని మళ్లీ వారికే అప్పగించి కొంత శాతం ఫీజు వారికి చెల్లించి వాటిని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రైవేట్ సంస్థలకు టోల్ గేట్లను అప్పగించి ప్రభుత్వం టోల్ ఫీజును వసూళ్లు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎప్పుడూ కూడా టోల్ గేట్లు ఉంటూనే ఉంటాయి. పెట్రోలు ఖర్చుతో పాటు టోల్ ఖర్చు కూడా భారీగా ఉంటుంది. కనుక ప్రయాణం చేసేప్పుడు కాస్త చూసుకోవడం మంచిదని రోడ్డు భద్రతా అధికారులు చెబుతున్నారు.