7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్.. డీఏపై 3 శాతం పెంపు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్.. డీఏపై 3 శాతం పెంపు !

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో బంపర్ బొనాంజా లభించే అవకాశం ఉన్న‌ట్టుగా తెలుస్తుంది. ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. కనీసం 3శాతం వరకూ పెంచే యోచన చేస్తున్నట్లు సమాచారం. 2024, జూలై 1 నుంచి ఈ పెంచిన డీఏను అమలు చేసేలా ప్రణాళిక చేస్తుండ‌గా, ఈ మొత్తాన్ని సెప్టెంబర్ మాసంలో ఉద్యోగులకు అందించేందుకు కసరత్తు చేస్తోంది. 3శాతం డీఏ అయితే ఖాయమని.. అవకాశాన్ని బట్టి […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 August 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్.. డీఏపై 3 శాతం పెంపు !

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో బంపర్ బొనాంజా లభించే అవకాశం ఉన్న‌ట్టుగా తెలుస్తుంది. ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. కనీసం 3శాతం వరకూ పెంచే యోచన చేస్తున్నట్లు సమాచారం. 2024, జూలై 1 నుంచి ఈ పెంచిన డీఏను అమలు చేసేలా ప్రణాళిక చేస్తుండ‌గా, ఈ మొత్తాన్ని సెప్టెంబర్ మాసంలో ఉద్యోగులకు అందించేందుకు కసరత్తు చేస్తోంది. 3శాతం డీఏ అయితే ఖాయమని.. అవకాశాన్ని బట్టి అది 4శాతానికి పెరగవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 3 నుంచి 4శాతం వరకూ డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ప్రకటించే అవకాశం ఉందని.. 3శాతం పెంపును ద్రవీకరించినా.. అప్పటి ద్రవ్యోల్బణ పరిస్థితిని బట్టి అది 4శాతానికి కూడా పెరగవచ్చిన విశ్వసనీయ వర్గాల సమాచారం.

7th Pay Commission బంప‌ర్ బొనాంజా..

అయితే ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తారు. జనవరిలో డీఏ 4 శాతం పెంచడంతో డీఏ 50 శాతానికి చేరింది. ఇప్పుడు 3 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 53 శాతానికి చేరుతుంది. ఆ క్రమంలో ఉద్యోగి డియర్‌నెస్ అలవెన్స్ రూ.1,00,170 వరకు పొందవచ్చు. ఈ పెంపు గ్రేడ్ పే, జీతం ఆధారంగా మారుతుంది. 4వ వేతన సంఘం సమయంలో డీఏ అత్యధికంగా 170 శాతానికి చేరుకుంది. 2024 మార్చిలో ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ 4 శాతం పెంచింది. దీంతో ఈ మొత్తం బేసిక్ పేలో 50 శాతానికి చేరింది. పెన్షనర్లకు ఇచ్చే డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) కూడా 4 శాతం పెరిగింది. సాధారణంగా జనవరి, జులై నుంచి అమల్లోకి వచ్చే డీఏ, డీఆర్‌ సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు.

7th Pay Commission

7th Pay Commission

8వ వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య డిమాండ్‌ చేస్తున్నాయి. దీనిపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి జులై 30న రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవని కేంద్ర మంత్రి తెలిపారు. 7వ వేతన సంఘం 2014 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. దీని సిఫార్సులను 2016 జనవరి 1 నుంచి అమలు చేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సమీక్షించడానికి , సవరించడానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒక కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది