Bank Holidays : ఫిబ్రవరిలో ఎన్ని సెలవులు వచ్చాయో తెలుసా.. బ్యాంక్ ఖాతాదారులు ఇలా ప్లాన్ చేసుకోండి..!
Bank Holidays : సాధారణంగా చాలా మంది నిత్యం బ్యాంకు పనులతో బిజీగా గడుపుతుంటారు. అయితే ఒక్కోసారి వరుస సెలవులు రావడంతో పరిస్థితి వేరేలా ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా కొన్ని ప్లాన్స్ చేసుకొని ముందుకెళితే బాగుంటుంది. మీకు ఫిబ్రవరిలో ముఖ్యమైన బ్యాంకు పనులు ఉంటే, బ్యాంకుకు వెళ్లే ముందు ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి. బ్యాంకులు తెరిచి ఉన్న రోజే మీ ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేసుకోండి. సాధారణంగా బ్యాంకులకు ప్రతీ ఆదివారం సెలవు ఉంటుంది. దీంతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవే. కాబట్టి బ్యాంకులకు ప్రతీ నెలలో ఆరు లేదా ఏడు సెలవులు వస్తాయి… ఫిబ్రవరిలో 28 రోజులు ఉన్నాయి కాబట్టి ఆరు సెలవులు వచ్చాయి.ఫిబ్రవరి 01వ తేదీ నుంచి 28వ రోజుల్లో పాటు మొత్తం బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు రానున్నాయి.
ఈ నెలలో రెండో, నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి. వివిధ రాష్ట్రాలకు వేర్వేరు సెలవులు ఉంటాయి. కొన్ని పండుగలు, ఇతరత్ర వాటికి సంబంధించి బ్యాంకుల సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు.ఫిబ్రవరి నెలలో వైశాఖ పంచమి, గురు రవిదాస్ జయంతి నాడు బ్యాంకులకు సెలవు ఉంటుంది.అయితే, ఫిబ్రవరి నెలలో, దేశంలోని వివిధ రాష్ట్రాలు, స్థానిక క్యాలెండర్ ప్రకారం సెలవులను నిర్ణయించంది ఆర్బీఐ… ఇలా బ్యాంకులకు మొత్తం 12 రోజులపాటు సెలవులు రానున్నాయి. అయితే ఇందులో వివిధ రాష్ట్రాలకు వేర్వేరు సెలవులు ఉంటాయి. ఫిబ్రవరిలో ఈ 12 రోజులు సెలవులు ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం సేవలు కొనసాగుతాయి.
Bank Holidays : ఫిబ్రవరిలో సెలవుల వివరాలు..
ఫిబ్రవరి 2: సోనమ్ లోచర్ (గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు మూసివేయబడ్డాయి)
ఫిబ్రవరి 5- సరస్వతి పూజ, బసంత్ పంచమి (అగర్తల, భువనేశ్వర్, కోల్‌కతాలలో బ్యాంకులు మూసి ఉంటాయి.)
ఫిబ్రవరి 6- ఆదివారం..
ఫిబ్రవరి 12- రెండో శనివారం
ఫిబ్రవరి 13- ఆదివారం
ఫిబ్రవరి 15- మహ్మద్ హజ్రత్ అలీ బర్త్‌డే, ఇఫాల్, కాన్పూర్, లక్నోలలో బ్యాంకులు మూసి ఉంటాయి.)
ఫిబ్రవరి 16- గురు రవిదాస్ జయంతి (చండీగఢ్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి).
ఫిబ్రవరి 18 – డోల్జాత్రా (కోల్‌కతాలో బ్యాంకులు మూసి ఉంటాయి).
ఫిబ్రవరి 19-ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి (ముంబై, నాగ్‌పూర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి).
ఫిబ్రవరి 20- ఆదివారం..
ఫిబ్రవరి 26 -నాలుగో శనివారం
ఫిబ్రవరి 27: ఆదివారం