Chandrababu : చంద్రబాబుకు సొంత పార్టీ నేతల నుంచి ఎదురు దెబ్బ.. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తానన్న మాజీ మంత్రి?
Chandrababu : ఏపీలో ప్రస్తుతం పరిషత్ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. పరిషత్ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలన్నీ రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీడీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.
కాకపోతే… టీడీపీ అధినేతగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలో కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పార్టీ నిర్ణయాన్ని పట్టించుకోకుండా… వాళ్ల ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులను బరిలో దించుతున్నట్టు ప్రకటిస్తున్నారు.
ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు.. టీడీపీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో… తాజాగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కూడా ఆ జాబితాలో చేరారు.
తన నియోజకవర్గం ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థులను బరిలో దించుతున్నామని ఆమె ప్రకటించారు. టీడీపీ తరుపున నిలబడిన అభ్యర్థులు ఎవరైతే వేరే పార్టీలో చేరారో… అక్కడి స్థానికులు, ప్రజలు, టీడీపీ అభిమానులు నోటాకు ఓటు వేసి.. టీడీపీ నుంచి వేరే పార్టీలోకి వెళ్లిన వాళ్లను సరైన బుద్ధి చెప్పాలన్నారు.
ఆళ్లగడ్డ తరుపున టీడీపీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామని.. పార్టీ తరుపున ప్రచారం చేస్తామని.. అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆమె స్పష్టం చేశారు.
Chandrababu : వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలకు నిరసనగా పరిషత్ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ
అయితే… ఇదివరకు ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమయంలోనే వైసీపీ ఎన్నికల్లో దౌర్జన్యాలకు, అక్రమాలకు పాల్పడి ఏకగ్రీవాలు చేసుకుందని టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా… కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ రావడం వల్ల.. ఇంకా చాలా అక్రమాలు, దౌర్జన్యాలకు వైసీపీ పాల్పడే అవకాశం ఉందంటూ టీడీపీ ఆరోపిస్తూ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. కానీ.. చంద్రబాబు నిర్ణయాన్ని కాదని… కొందరు టీడీపీ నాయకులు పార్టీ తరుపున వాళ్ల మద్దతు దారులను, పార్టీ నేతలను బరిలో దించుతున్నారు.