Crime News : కొడుకులతో బాధ భరించలేక తనకు తాను చితి పేర్చుకొని చనిపోయిన 90 ఏళ్ల తండ్రి ..!!
Crime News : ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి కి చెందిన మెడబోయిన వెంకటయ్య అనే 90 ఏళ్ల వ్యక్తికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య గతంలోనే కాలం చేసింది. నలుగురు కుమారులకు నాలుగెకరాల భూమిని పంచాడు. నలుగురిలో ఇద్దరు పొట్లపల్లిలో, ఒకరు హుస్నాబాద్ లో మరొకరు కరీంనగర్ జిల్లాలో ఉంటున్నారు. ఎక్కువగా గ్రామంలోనే ఉంటున్న పెద్ద కుమారుడు కనకయ్య దగ్గర ఉంటున్నాడు. అయితే అతడి పోషణ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ విషయం పంచాయతీ వరకు వెళ్ళింది.
నెలకొకరు చొప్పున నలుగురు కుమారులు వంతుల వారిగా పోషించాలని ఐదు నెలల క్రితం గ్రామ పెద్దలు నిర్ణయించారు. అయితే పెద్ద కుమారుడు వద్ద గడువు పూర్తయినా సరే మరో కుమారుడి వద్దకు వెళ్లలేదు సొంత ఊరుని, ఇంటిని వదిలి వెళ్ళను అని చెప్పేవారు. అయినప్పటికీ గ్రామపంచాయతీ తీర్పుకుl కట్టుబడి మరో కుమారుడు వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరిన ఆయన గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నాడు. అక్కడ తన బాధను పంచుకున్నారు. బుధవారం ఉదయం కరీంనగర్లో ఉంటున్న మరో కుమారుడు దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరాడు. అయితే సాయంత్రం వరకు ఏ కుమారుడు ఇంటికి వెళ్లలేదు.

Crime News A 90-year-old father who could not bear the pain of his sons had committed suicide and died
గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామంలో ఎల్లమ్మ గుట్ట దగ్గర మంటల్లో కాలిన స్థితిలో పెద్దాయన మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం వెంకటయ్యదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. కుమారులు తనని పంచుకోవడానికి చూసి మనస్థాపానికి గురైన వెంకటయ్య తన కుమారుల మీద ఆధారపడకూడదని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తనకు తాను చితి పెర్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాటి కొమ్మలను ఒక దగ్గర కుప్పగా వేసి వాటికి నిప్పు అంటించి అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామం అంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ కష్టం ఏ తండ్రికి రాకూడదు అంటూ బాధపడుతున్నారు.