Aloe Vera Juice | కలబంద రసం ఆరోగ్య రహస్యం .. శరీరానికి మేలు, కానీ జాగ్రత్తలు తప్పనిసరి!
ఆరోగ్యంగా ఉండటానికి నేటి తరంలో చాలా మంది గ్రీన్ టీ, హెర్బల్ టీ, నేచురల్ కషాయాలు వంటివి తాగుతూ హెల్దీ లైఫ్ స్టైల్ కొనసాగిస్తున్నారు. వాటిల్లో ఒకటి కలబంద రసం (Aloe Vera Juice). శారీరక, మానసిక సమస్యలకు ఇది అద్భుత ఫలితాలు ఇస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కేవలం తాగడమే కాకుండా, కలబంద జెల్‌ను జుట్టు, చర్మం, ముఖ సౌందర్యానికి కూడా విస్తృతంగా వాడుతున్నారు. అయితే, ఈ రసం తాగడంలో ఉన్న ప్రయోజనాలు, అలాగే తాగరానివారు ఎవరో తెలుసుకోవడం అవసరం.
#image_title
పోషకాలు మెండుగా
కలబంద రసంలో విటమిన్ A, C, E, B-కాంప్లెక్స్, అలాగే కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. పరగడుపున తాగితే ఈ పోషకాలు నేరుగా శరీరానికి చేరుతాయి. ఇది శక్తిని పెంచి, చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది.
జీర్ణవ్యవస్థకు మేలు
పరుగడుపున కలబందరసం తాగడం ద్వారా జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఇందులోని సహజ ఎంజైమ్‌లు రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలను నియంత్రించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. అలాగే, యాసిడ్ రిఫ్లక్స్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
డిటాక్స్ ప్రభావం
కలబంద రసం శరీరాన్ని సహజంగా డిటాక్స్ చేస్తుంది. కడుపులోని వ్యర్థాలను బయటకు పంపి కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలంగా ఉంచుతాయి.
జాగ్రత్తలు తప్పనిసరి
అయితే, కలబంద రసాన్ని అతిగా తాగకూడదు. అధిక మోతాదులో తీసుకుంటే శరీరంలో పొటాషియం లోపం ఏర్పడి గుండె వేగంగా కొట్టుకోవడం లేదా గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చలికాలంలో దీన్ని తగ్గించడం మంచిది.
గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు కలబంద రసం తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది గర్భస్రావానికి దారి తీసే ప్రమాదం ఉంది. పుట్టబోయే శిశువుకు కూడా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రావచ్చు.