Good News : గుడ్ న్యూస్.. ఈ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్స్ న‌క్క తోక తొక్కిన‌ట్టే.. పెంచిన వ‌డ్డీ రేట్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Good News : గుడ్ న్యూస్.. ఈ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్స్ న‌క్క తోక తొక్కిన‌ట్టే.. పెంచిన వ‌డ్డీ రేట్లు

 Authored By sandeep | The Telugu News | Updated on :27 February 2022,11:30 am

Good News : రీసెంట్‌గా కొన్ని బ్యాంక్స్ త‌మ క‌స్ట‌మ‌ర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు తర్వాత.. బ్యాంకు ఆఫ్ బరోడా కూడా తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంకు ఆఫ్ బరోడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెంచిన వడ్డీ రేట్లు ఫిబ్రవరి 25, 2022 నుంచే అమల్లోకి వస్తున్నాయి. ఈ సవరణ తర్వాత.. బ్యాంకు ఆఫ్ బరోడా కొత్త వడ్డీ రేట్లు 2.80 శాతం నుంచి 5.25 శాతానికి మధ్యలో ఉన్నాయి. ప‌దేళ్ల వ‌ర‌కు ఈ ప‌రిమితి ఉండ‌గా, అదనంగా 0.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంకు పేర్కొంది.దీంతో అంద‌రు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

బ్యాంకు ఆఫ్ బరోడా 7 రోజుల నుంచి 45 రోజుల వరకు మెచ్యూరిటీ అయ్యే ఎఫ్‌డీలపై 2.80 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. అలాగే 46 రోజుల నుంచి 180 రోజులకు మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లకు 3.7 శాతం వడ్డీని, 181 రోజుల నుంచి 270 రోజుల వరకు మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లకు 4.30 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. 271 రోజుల నుంచి ఏడాది వ్యవధిలోపు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.4 శాతంగా ఉంది.

Good News for Bank Customers in Inflated interest rates

Good News for Bank Customers in Inflated interest rates

Good News : గుడ్ న్యూస్ చెప్పిన బ్యాంక్స్..

ఇక సంవత్సరానికి 5 శాతం వడ్డీ రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్లపై అందిస్తూ ఉండగా సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునేవారికి 5.1 శాతం వడ్డీ ఇవ్వనున్నారు.ఇక మూడేళ్ల నుంచి అయిదేళ్ల వరకూ ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి 5.25 శాతం వడ్డీ రేట్లను కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్ చేయడం గమనార్హం. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా మూడేళ్ల కాల వ్యవధి ఉన్న ఎఫ్‌డీలకు సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లను ఆఫర్ చేసే బ్యాంకులలో బంధన్ బ్యాంకు, యెస్ బ్యాంకులున్నాయి. ఒకవేళ ఈ బ్యాంకులలో రూ.లక్షను డిపాజిట్ చేస్తే.. మీకు మూడేళ్లలో రూ.1.23 లక్షలు చేతికి వస్తాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది