Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. నెలకు 95 వేల జీతం .. వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇలా ..!
Good News : కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ కు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో నోట్ ప్రెస్ సూపర్వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది బ్యాంకు నోట్లు డిజైన్ బ్యాంకు నోట్లు మరియు సెక్యూరిటీ ఇంకులు మొదలైనవి తయారు చేసే ఎస్ సిఎంపిసిఐఎల్ కంపెనీ ఢిల్లీలో ఉంది. నాణేలు ముద్రించే సంస్థలు ముంబై, కోల్కతా, హైదరాబాద్, నోయిడా లో ఉండగా, హైదరాబాద్ హోషంగాబాద్ లలో నాలుగు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లు ఉన్నాయి. అయితే వీటిలో హోషంగాబాద్ లో ఉన్న మిల్లులో అధిక నాణ్యత గల కరెన్సీ పేపర్ తయారవుతుంది.
అయితే ఈ సంస్థ ప్రతిభావంతులైన అభ్యర్థులను ఆహ్వానిస్తుంది. దేశంలో ఏ రాష్ట్రం వారైనా సరే ఈ జాబ్ కి అప్లై చేయవచ్చని నోటిఫికేషన్లో తెలుపబడింది. ఇందులో మొత్తం ఖాళీలు 125 ఉండగా, అందులో 22 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 103 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేషన్ ప్రింటింగ్ పోస్ట్ కి దరఖాస్తు చేసేవారు ఇంజనీరింగ్ ప్రింటింగ్ విభాగంలో ఫుల్ టైప్ డిప్లమా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలి. లేదా బీటెక్/ బిఈ, బీఎస్సి డిగ్రీ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ చేసే వారికి ప్రాధాన్యత ఉంటుంది. జూనియర్ టెక్నీషియన్ పోస్టుకి అర్హతలు ప్రింటింగ్ ట్రేడ్లో ఎన్సివిటి నుంచి గుర్తింపు పొందిన ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లో లేదా పాలిటెక్నిక్ లో లిథో ఆఫ్ సెట్ మిషన్
మైండర్ లేదా లెటర్ ప్రెస్ మిషన్ మైండర్ లేదా ఆఫ్సెట్ ప్రింటింగ్ లేదా ఫుల్ టైం ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఇక సూపర్వైజర్ పోస్ట్ కి వేతనం 27,600 నుంచి 95910 వరకు ఉంది. అలాగే జూనియర్ టెక్నీషియల్ పోస్ట్ కి జీతం 18,780 నుంచి 67,390 వరకు కలదు. సూపర్వైజర్ జూనియర్ టెక్నీషియన్ అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నాసిక్, కోల్కత్తా, హైదరాబాద్, ఢిల్లీ పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్ష జరుగుతుంది. పరీక్ష తేదీ జనవరి/ ఫిబ్రవరి 2023. యుఆర్/ ఓబిసి /ఈ డబ్ల్యూ ఎసత అభ్యర్థులు దరఖాస్తుకు 600 చెల్లించాలి. అలాగే ఎస్సీ/ ఎస్టీ /ఎక్స్ సర్వీస్ 200 చెల్లించారు. ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ జరుగుతుంది. 16-12-2022 దరఖాస్తు చివరి తేదీ.