Google pay Phone pay : గూగుల్ పే, ఫోన్ పేలకు ఆదాయం ఎలా వస్తుందో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Google pay Phone pay : గూగుల్ పే, ఫోన్ పేలకు ఆదాయం ఎలా వస్తుందో తెలుసా…?

కిరాణా కొట్టు నుంచి సూపర్ మార్కెట్ల వరకు.. రోడ్డు పక్కనుండే ఫుడ్​ ట్రక్​ నుంచి లగ్జరీ రెస్టారెంట్ వరకు ఇలా అన్నింటిలో ఇప్పుడు చెల్లింపులు చేసేందుకు ఫోన్​పే, గూగుల్​పే, వంటి డిజిటల్​ పేమెంట్​ యాప్​లు వినియోగిస్తున్నారు. అయితే ఆయా యాప్​లు మీ నుంచి ఛార్జీలు వసూలు చేయకుండా లభాలను ఎలా గడిస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా?నిజానికి ఈ యాప్​లకు యూపీఐ పేమెంట్స్ వల్ల ఎలాంటి ఆదాయం రాదు. ఇవి పేమెంట్స్ మాత్రమే కాకుండా చాలా రకాల సర్వీసులను అందిస్తుంటాయి. […]

 Authored By pavan | The Telugu News | Updated on :6 February 2022,10:00 pm

కిరాణా కొట్టు నుంచి సూపర్ మార్కెట్ల వరకు.. రోడ్డు పక్కనుండే ఫుడ్​ ట్రక్​ నుంచి లగ్జరీ రెస్టారెంట్ వరకు ఇలా అన్నింటిలో ఇప్పుడు చెల్లింపులు చేసేందుకు ఫోన్​పే, గూగుల్​పే, వంటి డిజిటల్​ పేమెంట్​ యాప్​లు వినియోగిస్తున్నారు. అయితే ఆయా యాప్​లు మీ నుంచి ఛార్జీలు వసూలు చేయకుండా లభాలను ఎలా గడిస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా?నిజానికి ఈ యాప్​లకు యూపీఐ పేమెంట్స్ వల్ల ఎలాంటి ఆదాయం రాదు. ఇవి పేమెంట్స్ మాత్రమే కాకుండా చాలా రకాల సర్వీసులను అందిస్తుంటాయి. మొబైల్ రీఛార్జ్​, కరెంట్​ బిల్​, గ్యాస్​ బిల్​, క్రెడిట్ కార్డ్ బిల్​ లాంటివి. మొబైల్ రీఛార్జ్​ తీసుకున్నట్లయితే టెలికాం కంపెనీలు ప్రతి లావాదేవీపై ఈ యాప్​లకు కమీషన్ ఇస్తుంటాయి.ఇదే విధంగా ఆయా యాప్​లు అందించే ఇతర సేవలకూ కమీషన్​ రూపంలో ఆదాయం వస్తుంది.

వస్తు, సేవల ప్రమోషన్​, వివిధ రకాల యాప్​ల ప్రచారం కూడా ఈ డిజిటల్​ పేమెంట్ యాప్​లు నిర్వహిస్తుంటాయి.ఉదాహరణకు ఫోన్​పేలో.. గ్రాసరీస్, ఇన్సూరెన్స్, ఫుడ్ తదితర సేవలను అందిస్తుంది. వీటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది.డేటా..డేటాను కొత్త తరహా ఇంధనంగా అభివర్ణిస్తుంటారు. ఈ డిజిటల్ పేమెంట్ యాప్​లలో వినియోగదారులు చేసే లావాదేవీల డేటా స్టోర్ అవుతుంది. దీని ద్వారా వినియోగదారుడి షాపింగ్ అలవాట్లు, అవసరాలు తెలుస్తాయి. ఈ డేటాను వివిధ కంపెనీలకు, ప్రకటన సంస్థలు కొనుగోలు చేసాయి. ఫలితంగా పేమెంట్ యాప్​లకు ఆదాయం లభిస్తుంది. ఆ డేటాను కొనుగోలు చేసిన కంపెనీలు.. వినియోగదారుడి అలవాట్లకు తగ్గట్లు ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చేందుకు ఉపయోగించుకుంటాయి.

google pay phone pay get Money income

google pay phone pay get Money income

ప్రకటనలు: ఫోన్ పే, గూగుల్ పే ఇచ్చే రివార్డులు ఉంటాయి. అందులో పలు కంపెనీలకు సంబంధించి కూపన్ లు ఉంటాయి. ఒకరకంగా అది ప్రమోషన్… ఆ ప్రమోషన్ ద్వారా వాళ్లకు కొంత నగదు వస్తుంది. ఇక ఆ కూపన్ ఆధారంగా కొనుగోలు చేసినా సరే కొంత కమీషన్ ఇస్తారు.లోన్స్ , ఇన్సూరెన్స్ సర్వీసులు: లోన్స్ , ఇన్సూరెన్స్ సర్వీసుల భాగ్యస్వామ్యం తో కూడా వాళ్లకు డబ్బులు వస్తాయి. వాళ్ళ సర్వీసులను ప్రమోట్ చేస్తే కమీషన్ వస్తుంది.సంస్థ నికర , స్థూల ఆదాయం : ఇక యాప్ వినియోగదారులు పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతుంది, కంపెనీ విలువ పెరుగుతుంది.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది