Kidney Stones : కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా? ఈ ఫుడ్ తిన్నారో ప్రాణాలకే ప్రమాదం.. ఈ ఫుడ్ అస్సలు తినొద్దు..!
Kidney Stones : మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కిడ్నీ. పేరుకు రెండు కిడ్నీలు ఉన్నా.. ఒక్క కిడ్నీ దెబ్బతిన్నా రెండు కిడ్నీలపై ఆ ప్రభావం ఉంటుంది. రెండు కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఏ ఒక్క కిడ్నీకి ఏమైనా కూడా కష్టమే. కిడ్నీలు మన శరీరంలోనే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నవి. అవి శరీరంలోని చెత్త చెదారం, విష పదార్థాలు, అన్నింటినీ ఫిల్టర్ చేస్తాయి. రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి. అయితే.. ఒక్కోసారి మనం తినే ఆహారంలో ఏవైనా రసాయనాలు ఉన్నా.. లేదా మంచినీళ్లు ఎక్కువగా తాగకపోయినా.. కొన్ని ఖనిజాలు, లవణాల వల్ల.. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. రాళ్ల వల్ల మూత్రపిండాలు సరిగ్గా పనిచేయవు.
కిడ్నీలలో రాళ్లు వస్తే.. వెంటనే డాక్టర్ ను సంప్రదించి.. మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి రాళ్లు పెద్దవి అయితే.. తప్పని పరిస్థితుల్లో రాళ్లను ఆపరేషన్ చేసి తీయాల్సి ఉంటుంది. అయితే.. ఒకవేళ మీకు కిడ్నీలో రాళ్లు కనుక వస్తే.. మీరు తినకూడనివి కొన్ని ఉన్నాయి. ఎందుకంటే.. ఏది పడితే అది తింటే.. మూత్రపిండాల్లో రాళ్లు ఇంకా పెరుగుతాయి కానీ.. తగ్గవు.
Kidney Stones : ఈ ఫుడ్ ను అస్సలు ముట్టుకోకండి
కిడ్నీల్లో రాళ్లు ఉంటే.. ఉప్పుకు దూరంగా ఉండాల్సిందే. ఉప్పు ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. ఉప్పు ఎక్కువగా తింటే.. ఉప్పు కూడా ఒక లవణం కాబట్టి.. అది మూత్రపిండాలలోని రాళ్లను పెద్దదిగా చేస్తుంది. మాంసాహారం అస్సలు తినకూడదు. మంచినీళ్లు మాత్రం ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. చాక్లెట్లు, చాయ్, కాఫీ లాంటివి అస్సలు తాగకూడదు. అలాగే.. పాల ఉత్పత్తులను మానేయాలి. ఎక్కువ ఆక్సిలేట్ ఉండే ఆహారాన్న కూడా తినకూడదు. ఆక్సిలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే టమాటాలు, ఆకు కూరలు, సోయా ఉత్పత్తులను మానేయాలి. ఆక్సిలేట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే.. కాల్షియం ఎక్కువైపోయి.. రాళ్లు ఇంకా పెద్దవి అవుతాయి.
అందుకే.. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవాళ్లు అన్ని జాగ్రత్తలు పాటించి.. ఈ ఆహారాన్ని తినడం మానేస్తూ.. డాక్టర్ల సూచనలను పాటిస్తే.. తొందరగానే కిడ్నీలలో ఉన్న రాళ్లు తొలిగిపోతాయి. ఒకవేళ.. తినకూడని పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే.. కిడ్నీలలో రాళ్లు ఇంకా పెరుగుతాయి. దాని వల్ల ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి.
ఇది కూడా చదవండి ==> పెరుగును తెగ లాగించేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు?
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు.. ఔషధాల గని ఈ మొక్క.. దీని వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇది కూడా చదవండి ==> తులసి కషాయం.. తయారీ ఉపాయం.. రోగాల నుంచి తప్పే అపాయం..!
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. నేల ఉసిరి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?