YS Jagan : నువ్వు మగాడివి… ముఖ్యమంత్రి అంటే నువ్వే.. వైఎస్ జగన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేత ప్రశంసలు?
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఆయన పార్టీ నేతలు పొగడడం చూశాం. telugu news ఏపీ ప్రజలు పొగడటం చూశాం. కానీ… పక్క రాష్ట్రం తెలంగాణకు చెందిన నేతలు పొగడటం ఎప్పుడూ చూడలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను కాదని… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను పొగడ్తల్లో ముంచెత్తారు ఆ నేత. ఆయన ఎవరో కాదు… తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఏపీ సీఎం వైఎస్ జగన్ నిఖార్సయిన ముఖ్యమంత్రి అని మగాడంటే ఆయన అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల హడావుడి నడుస్తోంది కదా. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. నకిరేకల్ మున్సిపాలిటీలోనూ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. నకిరేకల్ లో కోమటిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం జగన్ ను పొగిడారు. ప్రస్తుతం కరోనా తీవ్రంగా ప్రబలుతున్న వేళ.. ఏపీ సీఎం వైఎస్ జగన్.. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని కరోనాకు ట్రీట్ మెంట్ ను ఉచితంగా అందించడం కోసం కరోనా ట్రీట్ మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేర్చారని ప్రశంసించారు.
YS Jagan : కేసీఆర్ నువ్వెందుకు కరోనా ట్రీట్ మెంట్ ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడం లేదు?
ఓవైపు ఏపీలో సుపరిపాలన అందిస్తూ… కరోనా పోరుపై తీవ్రంగా పోరాడుతూ.. కరోనా వస్తే ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు తగలేయాల్సిన అవసరం లేకుండా… సీఎం జగన్… కరోనా ట్రీట్ మెంట్ ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తే… తెలంగాణలో మాత్రం ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా ట్రీట్ మెంట్ ను తీసుకురాలేదు. ఒకసారి ఏపీ సీఎం జగన్ ను చూసి నేర్చుకో కేసీఆర్. కరోనా ట్రీట్ మెంట్ ను ఎందుకు నువ్వు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం లేదు.. అంటూ సీఎం కేసీఆర్ పై కోమటిరెడ్డి మండిపడ్డారు. అలాగే.. మీరు నకిరేకల్ లో ఓటు వేసే ముందు…. మీకు అధికార పార్టీ ఏం చేసింది అనేది కూడా గుర్తు పెట్టుకొని ఓటేయండి. మీ కొడుక్కి ఉద్యోగం ఇచ్చిందా? మీకు ఇండ్లు వచ్చాయా? లేదా? సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అనేది ఆలోచించి ఓటేయండి… అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. telugu news