Thippa Teega : తిప్ప తీగను వాడేముందు ఈ నిజాలు తెలుసుకోండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం..!
Thippa Teega : తిప్ప తీగ తెలుసు కదా. ఆయుర్వేదంలో దీనికి ఉన్న ప్రాధాన్యత ఏ మొక్కకూ ఉండదు. ప్రతి ఆయుర్వేద మందు తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో దీన్ని గొప్ప ఔషధంగా పరిగణిస్తారు. అందుకే.. తిప్ప తీగను చాలామంది వాడుతుంటారు. చివరకు దీన్ని ఆనందయ్య కూడా తన ఆయుర్వేద మందులో ఉపయోగించారు. దీంతో ప్రస్తుతం అందరూ తిప్ప తీగ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. తిప్ప తీగను తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కానీ.. తిప్ప తీగను ఎలా తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఎలా వాడాలి? అనే విషయ తెలుసుకోకపోతే మాత్రం ప్రాణాలకే ప్రమాదం అట.
తిప్ప తీగను అమృత అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. ఇది అమృతంలా సర్వరోగ నివారిణిగా ఉపయోగపడుతుంది కాబట్టి. తిప్పతీగ ఆకులను తీసుకున్నా.. దాని కాండాన్ని తీసుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. వాటి వేర్లను కూడా ఆయుర్వేద మందులో విరివిగా ఉపయోగిస్తారు.
Thippa Teega : తిప్ప తీగ ఆరోగ్య ప్రయోజనాలు
తిప్ప తీగను రసంగా చేసుకొని తాగొచ్చు. లేదంటే పొడిగా చేసుకొని కూడా తీసుకోవచ్చు. లేదంటే.. మాత్రల్లా తయారు చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా తిప్ప తీగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి. తిప్ప తీగను నిత్యం తీసుకుంటే.. శరీరంలో కావాల్సినంత రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి శరీరానికి కావాల్సినంత ఉండటంతో.. శరీరంలోకి ఏ వైరస్ లు ప్రవేశించే అవకాశమే ఉండదు.
తిప్ప తీగ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సీజనల్ రోగాలను తరిమికొడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ కు ఇది బెస్ట్ మందు. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడేవాళ్లకు తిప్ప తీగ మంచి ఔషధం. రక్తంలోని చక్కెర స్థాయిలను తిప్ప తీగ కంట్రోల్ లో ఉంచుతుంది. ఒత్తిడి తగ్గాలన్నా.. డిప్రెషన్ ఎక్కువైనా.. తిప్ప తీగ మంచి మందులా పనిచేస్తుంది.
కంటికి సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టాలన్నా తిప్ప తీగను తీసుకోవాల్సిందే. కంటి సైట్ ను తగ్గిస్తుంది. దాని పౌడర్ ను కాసిన్ని నీటిలో వేసి ఉడకబెట్టి.. చల్లారాక కనురెప్పల మీద వేస్తే.. కండ్లు స్పష్టంగా కనిపిస్తాయి. శ్వాసకోశ సమస్యలు ఉన్నా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నా.. దగ్గు, జలుబు లాంటి సమస్యలు ఉన్నా కూడా తిప్పతీగ దివ్యౌషధంలా పనిచేస్తుంది.
Thippa Teega : తిప్ప తీగ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే
తిప్పతీగ నిజానికి మంచి ఆయుర్వేద మందు అయినప్పటికీ.. ఇది ఒక సమర్థమైన హైపోగ్లైసిమిక్ ఏజెంట్ అయినప్పటికీ.. డయాబెటిస్ ఉన్నవాళ్లు.. డైరెక్ట్ గా దీన్ని తీసుకోకపోవడమే ఉత్తమం. షుగర్ ఉన్నవాళ్లు తమ షుగర్ లేవల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకొని.. ఒకసారి డాక్టర్ ను సంప్రదించి.. ఆ తర్వాత తిప్పతీగను వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే.. ఇది రక్తంలోని చక్కెర లేవల్స్ ను ఒక్కసారిగా తగ్గిస్తుంది కాబట్టి.. కొందరికి షుగర్ లేవల్స్ పడిపోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి వాళ్లు ముందు ఒకసారి డాక్టర్ ను సంప్రదించి.. షుగర్ లేవల్స్ చెక్ చేసుకొని తిప్పతీగను వాడటం మంచిది.
అలాగే.. గర్భిణీలు.. బాలింతలు తిప్పతీగను వాడేముందు మాత్రం ఖచ్చితంగా ఆయుర్వేద డాక్టర్ ను సంప్రదించడం బెటర్. అలాగే ఆటో ఇమ్యూన్ అనే వ్యాధితో బాధపడేవాళ్లు.. తిప్పతీగను డైరెక్ట్ గా తీసుకోవడం మంచిది కాదు. ఆటో ఇమ్యూన్ సమస్య ఉన్నవాళ్లలో రోగ నిరోధక శక్తికి సంబంధించిన సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్లు ఒకసారి తమ డాక్టర్ ను సంప్రదించి.. తిప్పతీగను తీసుకోవాలి.
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు.. ఔషధాల గని ఈ మొక్క.. దీని వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇది కూడా చదవండి ==> క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వెంటనే జ్యూస్ చేసుకొని తాగేస్తారు..!
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. నేల ఉసిరి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇది కూడా చదవండి ==> ఈ కాయలు కనిపిస్తే అస్సలు వదలకండి.. వీటి గురించి తెలిసి డాక్టర్లే నోరెళ్లబెట్టారు?