Lemon Water : నిమ్మకాయ నీళ్లను ఏ సమయంలో తాగితే ఎటువంటి లాభాలు కలుగుతాయి?
Lemon Water : లెమన్ వాటర్ కు మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అందరికీ తెలుసు. అలసటగా ఉన్నా.. నీరసంగా ఉన్నా.. ఒంట్లో శక్తి లేకున్నా.. కాసిన్ని నీళ్లలో ఇంత నిమ్మరసం పిండుకొని తాగేస్తాం. దీంతో వెంటనే ఒంట్లో శక్తి వస్తుంది. అయితే.. చాలామంది రోజూ ఉదయం పరగడుపున నిమ్మరసం నీళ్లు తాగుతుంటారు. కొందరు మాత్రం రాత్రి పూట నిమ్మకాయ నీళ్లను తాగుతుంటారు. ఎలా తాగినా.. ఎప్పుడు తాగినా.. నిమ్మకాయ నీళ్ల వల్ల చాలా లాభాలు ఉంటాయి. కానీ.. ఎప్పుడు తాగితే లాభమో… ఏ సమయంలో తాగితే ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
ఉదయం పూట నిమ్మకాయ నీళ్లను తాగితే ఒక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి పూట తాగితే మరోరకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తమకు ఉన్న ఆరోగ్య సమస్యలను బట్టి.. ఉదయం అయితే ఉదయం లేదంటే.. రాత్రి పూట నిమ్మకాయ నీళ్లను తీసుకోవచ్చు.
Lemon Water : నిమ్మకాయ నీళ్లను ఉదయం తీసుకుంటే ఏమౌతుంది?
నిమ్మకాయ నీళ్లను ఉదయం తాగితే.. డీహైడ్రేషన్ కు గురి కారు. అలాగే.. శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. అలసట రాదు. నీరసం కూడా ఉండదు. శరీరంలో మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. దీని వల్ల శరీరంలో ఉన్న అనవసర కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మీకు జీర్ణ సమస్యలు ఉన్నా… లేదా గ్యాస్, అసిడిటీ లాంటి సమస్యలు ఉన్నా.. ఉదయం పూట నిమ్మరసం నీళ్లను తాగండి.
Lemon Water : రాత్రి పూట నిమ్మకాయ నీళ్లను తాగితే ఏమౌతుంది?
రాత్రి పూట నిమ్మకాయ నీళ్లను తాగితే.. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఎందుకంటే.. రాత్రి పూట నిమ్మకాయ నీళ్లను తాగి పడుకుంటారు. తెల్లారే సరికి.. మోషన్ ఫ్రీ అవుతుంది. అలాగే.. పెద్ద పేగు కూడా శుభ్రం అవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కడుపులో మంట రాదు. ఎక్కడైనా శరీరం మీద వాపులు వస్తే అవి కూడా తగ్గిపోతాయి.
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు.. ఔషధాల గని ఈ మొక్క.. దీని వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇది కూడా చదవండి ==> క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వెంటనే జ్యూస్ చేసుకొని తాగేస్తారు..!
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. నేల ఉసిరి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇది కూడా చదవండి ==> ఈ కాయలు కనిపిస్తే అస్సలు వదలకండి.. వీటి గురించి తెలిసి డాక్టర్లే నోరెళ్లబెట్టారు?