AP Govt : వెనక్కి తగ్గేది లేదు.. అని సవాల్ చేసిన వైఎస్ జగన్.. ఆ విషయంలో ఎందుకు తగ్గారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Govt : వెనక్కి తగ్గేది లేదు.. అని సవాల్ చేసిన వైఎస్ జగన్.. ఆ విషయంలో ఎందుకు తగ్గారు?

 Authored By sukanya | The Telugu News | Updated on :23 July 2021,6:30 pm

AP Govt : ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లో సంచలన మలుపు తిరిగింది. దమ్మాలపాటి శ్రీనివాస్ పై గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వైఎస్ జగన్ రెడ్డి Ys jagan సర్కార్ వెనక్కి తీసుకుంది. అమరావతిలో అసలు ఇన్ సైడర్ ట్రేడింగే జరగలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అమరావతిలో రాజధాని వస్తుందన్న ముందస్తు సమాచారంతో దమ్మాలపాటి శ్రీనివాస్ ముందే భూములు కొనుగోలు చేశారని వైసీపీ సర్కారు ఎప్పటినుంచో ఆరోపిస్తోంది.

ఇన్ సైడర్ ట్రేడింగ్ లో దమ్మాలపాటి శ్రీనివాస్ Dulapati Srinivas కూడా భాగస్వామేనని చెబుతోంది. దీనిపై ఏసీబీ విచారణ షురూ చేయగా, దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు వెళ్లారు. దాంతో హైకోర్టు ఏసీబీ దర్యాప్తుపై స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. అమరావతి భూముల్లో భారీ అవినీతి జరిగిందని.. కోట్ల రూపాయల కుంభకోణం ఉందని.. అప్పటి సీఎం చంద్రబాబు దగ్గరుండి స్కామ్ కు పాల్పడ్డారని.. వైసీపీ ప్రభుత్వం పదే పదే ఆరోపిస్తూ వస్తోంది. ఇప్పటికే సీఐడీ కూడా విచారణలో వేగం పెంచింది.

Ys Jagan

Ys Jagan

సుప్రీంలో చుక్కెదురు.. AP Govt

అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా, అక్కడా చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో దమ్మాలపాటి శ్రీనివాస్ పై తాము దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టులో విచారణ ఇంకా పెండింగ్ లో ఉంది. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలియజేశారు. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని వెల్లడించారు.

Indian Supreme Court

Indian Supreme Court

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం… నాలుగు వారాల్లో దీనికి సంబంధించిన విచారణ పూర్తి కావాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వైసీపీ అభిమానులకు షాక్ ఇచ్చినా.. టీడీపీ నేతలు మాత్రం ఇది తమ నైతిక విజయం అంటున్నారు. ఏపీ ప్రభుత్వం డ్రామాలన్నీ ఏపీ ప్రజలకు అర్థమైందని.. ఇంకా అక్రమ ఆరోపణలు చేస్తే.. ప్రజలే తిరగబడతారని.. అందుకే భయపడి ఏపీ ప్రభుత్వం పిటిషన్ ను వెనక్కు తీసుకుందని అంటున్నారు.. అయితే అమరావతి భూముల క్రయవిక్రయాలపై ప్రభుత్వం దూకుడుగా వెళ్తున్నా.. న్యాయస్థానాలు మాత్రం బ్రేకులు వేస్తున్నాయి. మొదట హైకోర్టు.. తాజా సుప్రీం కోర్టు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చాయి.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది