Tirupati by poll : వైసీపీ దూకుడుకు తడిపేసుకుంటున్న టీడీపీ నేతలు? ముందుంది మొసళ్ల పండుగ అంటున్న వైసీపీ?
Tirupati by poll : ఏపీలో ప్రస్తుతం తిరుపతి ఉపఎన్నిక మీదనే అందరి చూపు పడింది. ఏపీ ప్రజలు కూడా తిరుపతి ఉపఎన్నికల్లో ఎటువంటి ఫలితం వస్తుందోనని తెగ ఎదురు చూస్తున్నారు. ఏపీ రాజకీయాలు కూడా బాగా వేడెక్కాయి. ఓవైపు ఎండాకాలం… మరోవైపు తిరుపతి ఎన్నిక వల్ల వచ్చే రాజకీయ వేడి.. ఈ వేడిని రాజకీయ పార్టీలు అయితే తట్టుకోలేకపోతున్నాయి.
తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ అంటే ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే. బీజేపీ కూడా పోటీ చేస్తున్నా…. బీజేపీని జనాలు లైట్ తీసుకున్నారు. ఏపీలో ఇంకా బీజేపీ పరిస్థితి అట్టట్టే అన్నట్టు ఉన్నది.
ఎలాగైనా తిరుపతి ఉపఎన్నికల్లో గెలిచి…. బీజేపీకి, టీడీపీకి సవాల్ విసరాలి అనే కసి మీద అధికార వైసీపీ పార్టీ ఉంది. అందుకే… ఏ ఎన్నికలకు రచించని వ్యూహాలను వైసీపీ ఈ ఎన్నికల్లో రచిస్తోంది. దీంతో వైసీపీ వ్యూహాలను చూసి టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. వామ్మో.. వైసీపీ దూకుడు మామూలుగా లేదుగా అంటూ నోరెళ్లబెడుతున్నారు.
Tirupati by poll : నామినేషన్ నే పెద్ద పండుగలా నిర్వహించిన వైసీపీ
తాజాగా వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి.. తిరుపతి స్థానానికి నామినేషన్ వేయడానికి ఎన్నికల ఆఫీసుకు వెళ్లగా… దాన్ని పెద్ద పండుగలా నిర్వహించారు వైసీపీ నేతలు. భారీ ర్యాలీతో పాటు…. గురుమూర్తి వెంట ఏడుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. ఒక పెద్ద మీటింగ్ లా జరిగింది నామినేషన్ పర్వం. అంత భారీ ర్యాలీని చూసి టీడీపీ నేతలు దడుసుకున్నారట.
మరోవైపు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ మాత్రం ఏమాత్రం హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా నామినేషన్ వేసి వచ్చారు. వీళ్లు నామినేషన్ కే ఇంత హడావుడి చేశారంటే ఇక ఎన్నికల ప్రచార విషయంలో ఎలా ఉంటారు? అని టీడీపీ నేతలు తమలో తామే చర్చించుకుంటున్నారట.
మొత్తానికి టీడీపీని మామూలుగా భయపెట్టలేదు వైసీపీ. ఇలా అయితే… తిరుపతి సీటును కూడా వదులుకోవాల్సిందే. జోరు పెంచకపోతే తప్పదు.. అని టీడీపీ నేతలు అధినేతకు సలహాలు ఇస్తున్నారట. మరి… వైసీపీ దూకుడుకు చంద్రబాబు కళ్లెం వేస్తారా? లేక లైట్ తీసుకుంటారా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.