Telangana Cabinet : తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు? సాగర్ ఉపఎన్నిక తర్వాత?
Telangana Cabinet : ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశం అవుతున్న విషయం నాగార్జునసాగర్ ఉపఎన్నిక. ఆ ఎన్నికల హడావుడి నడుస్తుండగానే మరో విషయం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చకు దారి తీసింది. అదే తెలంగాణ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు. అవును… తెలంగాణలో రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. అలాగే…. మంత్రివర్గాన్ని మరోసారి పునర్వ్యవస్థీకరిస్తామని సీఎం కేసీఆర్ కూడా పలుమార్లు చెప్పడంతో…. తాజాగా మంత్రి వర్గ విస్తరణపై చర్చ నడుస్తోంది.
అయితే… మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడ చేయాలి? అనేదానిపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారట. ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఉండటంతో…. ఆ ఎన్నికలు ముగియగానే.. మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయాలని భావించినా…. ఆ తర్వాత మేలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి.
అందుకే…. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తయ్యాక…. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారట. అయితే… ఈ మంత్రి వర్గ మార్పులు చేర్పుల ప్రక్రియలో ఎవరు ఉంటారు? ఎవరు వెళ్తారు? ఎవరు కొత్తగా వస్తారు అనేదానిపైనే ప్రస్తుతం చర్చ విపరీతంగా నడుస్తోంది.
Telangana Cabinet : కొత్తవారికైతే అవకాశం ఇవ్వనున్న కేసీఆర్
అయితే… ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి వర్గంలోకి కొందరు కొత్త వాళ్లను సీఎం కేసీఆర్ తీసుకోనున్నారట. అలాగే… ఇద్దరు ముగ్గురు మంత్రులపై వేటు కూడా పడే చాన్స్ ఉందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే… ఆ ఇద్దరు ముగ్గురు ఎవరు అనేది మాత్రం తెలియదు. సీఎం కేసీఆర్ ఆ మంత్రులపై కాస్త అసంతృప్తితో ఉన్నారట.
చూద్దాం మరి.. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో ఎవరికి చోటు దక్కుతుందో? ఎవరి పదవి పోతుందో?