Today Gold Rates : బంగారం ధరలలో కొద్ది రోజులుగా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. తగ్గితే ఒకేసారి రెండు మూడు రోజలు పాటు తగ్గడం లేదంటే భారీగా పెరగడం జరుగుతుంది. అయితే పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. తాజాగా రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఆదివారం బంగారం ధరలు భగ్గుమనగా.. సిల్వర్ రేట్లు మాత్రం శాంతించాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.46,900కి చేరుకుంది. ఈ ధర శనివారం రూ.46,400 వద్ద పలికింది.

Today Gold Rates : పసిడికి రెక్కలు
24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.540 ఎగిసి రూ.51,160కు చేరుకుంది. బంగారం ధరలు ఇన్ని రోజులు భారీ పతన స్థాయిలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పైపైకి ఎగిశాయి. అక్కడ 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.46,900గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.540 పెరిగి రూ.51,160గా రికార్డయింది. సిల్వర్ రేటు రూ.300 తగ్గడంతో.. ఢిల్లీలో వెండి ధర రూ.55,100గా ఉంది.
విజయవాడలో కూడా బంగారం ధరలు ఇదే స్థాయిలో నమోదయ్యాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.46,900గా, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.540 పెరగడంతో.. రూ.51,160గా నమోదయ్యాయి. సిల్వర్ రేటు కూడా విజయవాడలో రూ.400 తగ్గి రూ.61,200గా ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,960గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,230గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది.