చంద్రబాబు కొంపముంచిన ఎల్లో మీడియా – రాత్రికి రాత్రి మారిపోయిన తలరాతలు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎప్పుడూ తన వెంట ఉంటూ ఆయనకు, ఆయన పార్టీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే పత్రికల గురించి అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఆ మీడియాను ఎల్లో మీడియా అని పిలుస్తుంటారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆహా.. ఓహో.. మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్న చంద్రబాబు అంటూ తెగ ఊరిస్తూ కథనాలు రాసింది ఎల్లో మీడియా. తీరా చూస్తే.. కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పాడినట్టుగా… ఏపీ ప్రజలు.. ఎల్లో మీడియా రాతలను, టీడీపీని బొంద పెట్టారు.
అయినప్పటికీ ఎల్లో మీడియా రోత రాత మాత్రం మారలేదు. నిజానికి.. ఎల్లో మీడియా మాయలో పడి తనను తాను నాశనం చేసుకునేది చంద్రబాబే. ఎందుకంటే.. బయట జరిగేది వేరు.. ఎల్లో మీడియాలో వచ్చేది వేరు. ఎల్లో మీడియాలో వచ్చేదే నిజం అనుకొని.. తనను తాను అతిగా చంద్రబాబు ఊహించుకోవడం 2019 ఎన్నికల్లో పెద్ద దెబ్బ పడింది అనే విషయం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో అంత దెబ్బ తగిలినా.. ఎల్లో మీడియా మాత్రం మళ్లీ అదే జోరుతో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోంది.
చంద్రబాబును వదిలిపెట్టం అంటున్న ఎల్లో మీడియా
ఏం జరిగినా.. ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబును వదిలేలా లేదు. అదే డబ్బా కొడుతూ.. ఇంకా చంద్రబాబు చుట్టూనే తిరుగుతోంది. ఏది ఏమైనా.. ఎల్లో మీడియా ఇలాగే.. ఉన్నదాన్ని లేనట్టుగా.. లేనిదాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ.. తమ ప్రతాపాన్ని చూపిస్తూ పోతే.. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు పెద్ద దెబ్బే పడేట్టు ఉంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముందు చంద్రబాబు ఎల్లో మీడియా ముసుగు నుంచి బయటపడాలి.. అలా బయటపడితేనే చంద్రబాబు ముందు సెట్ అవుతారు. లేదంటే అదే ముసుగులో మునిగిపోతారు.. అనే భావన సర్వత్రా నెలకొన్నది.