Earthquake : బిగ్ బ్రేకింగ్.. ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు.. ఉలిక్కి పడ్డ ప్రజలు..!
ప్రధానాంశాలు:
Earthquake : ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు.. ఉలిక్కి పడ్డ ప్రజలు
Earthquake : ఇటీవల భూప్రకంపనలు ప్రజలకి వణుకు పుట్టిస్తున్నాయి. New Delhi ఢిల్లీ-ఎన్‌సీఆర్, bihar Earthquake సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భూప్రకంపను సంభవించాయి. మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఎంపి , పాట్నా, బీహార్‌లోని ముజఫర్‌పూర్‌తో సహా ఉత్తర భారతదేశంలో బలమైన భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై 7.1 నమోదైనట్లు తెలుస్తోంది. నేపాల్-టిబెట్ సరిహద్దు అయిన లబుచేకు 93 కి.మీ దూరంలో సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావం భారత్‌లోని పలు రాష్ట్రాలపై పడింది. ఢిల్లీలతో పాటు బీహార్‌లోని మోతిహారి, సమస్తిపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం.
Earthquake : వణికిన భూమి
భూకంపం ధాటికి ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ సహా ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో భూప్రకంపనలతో అక్కడ నివసిస్తున్న వారు నిద్రలోంచి మేల్కొన్నారు. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతానికి ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు.ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో బలమైన భూకంపం సంభవించింది. ప్రస్తుతం భూకంప తీవ్రతకు సంబంధించిన సమాచారం తెలియరాలేదు. ఆ భూకంప తీవ్రత దాదాపు 4గా నమోదైంది. ఢిల్లీ, నోయిడా-గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, పాట్నా, ముజఫర్‌పూర్, వైశాలి, సీతామర్హి, మధ్యప్రదేశ్‌లోని అనేక నగరాలలో భూకంపం సంభవించిందని చెబుతున్నారు
మంగళవారం ఉదయం 6.40 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నారు. నేపాల్, చైనాలోనూ భూమి కంపించింది. నేపాల్‌లో దీని తీవ్రత 6.5గా ఉండగా, చైనాలో 6.9గా ఉంది. నేపాల్‌లోని లోబుచేకి ఉత్తర-వాయువ్యంగా 84 కి.మీ దూరంలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని, దీని లోతు 10 కి.మీ.లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నేపాల్‌లోని గోకర్ణేశ్వర్ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 7.1 నమోదైనట్లు తెలుస్తోంది. నేపాల్-టిబెట్ సరిహద్దు అయిన లబుచేకు 93 కి.మీ దూరంలో సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావం భారత్‌లోని పలు రాష్ట్రాలపై పడింది.