Banana Flower : అరటి పువ్వే కదా అని తొక్క తీసేసినట్లు తీసి పారేయకండి… వారానికి ఒక్కసారి తింటే మిరాకిలే…?
ప్రధానాంశాలు:
Banana flower : అరటి పువ్వే కదా అని తొక్క తీసేసినట్లు తీసి పారేయకండి... వారానికి ఒక్కసారి తింటే మిరాకిలే...?
Banana flower : చాలామంది అరటిపండు తింటూ ఉంటారు. కానీ Banana Flower అరటి పువ్వుని వదిలేస్తారు. కొంతమంది మాత్రం అరటి పువ్వు ని కూడా కూరగా వండుకొని తింటుంటారు. అరటి పువ్వు గురించి తెలిసినవారే తిని ఇలా చేస్తారు. అరటి పువ్వు గురించి తెలియని వారు, అరటి తొక్కను తీసివేసినట్లు తీసి పారేస్తారు. అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు తెలియజేశారు. అరటి పువ్వులో శరీరానికి కావలసిన మూలకాలు, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ, ఫైబర్, పొటాషియం, ప్రోటీన్, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇన్ని పోషక విలువలు కలిగి ఉండడం వలన అరటి పువ్వు అనేక వ్యాధులతో పోరాడుగలే శక్తిని కలిగి ఉంటుంది. అరటి పువ్వు మన శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తుందో తెలుసుకుందాం…
అరటి పువ్వులో ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ పువ్వులో ప్రోస్టేట్ నంది పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో దాగి ఉన్న రహస్యం, సిట్రిక్ యాసిడ్, అమినో ఆసిడ్స్,ప్రోస్టేట్ గ్రంధిని సాధారణ పరిమాణానికి తీసుకురాగలుగుతాయి. ఈ అరటి పువ్వు నెప్రో ప్రొటెక్టివ్ యాక్టివిటీ ని కలిగి ఉంటుంది. ఇది కిడ్నీలను దెబ్బ తినకుండా కాపాడుతుంది.అరటి పువ్వులో పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఫైబర్ ఉండటం వల్ల డయాబెటిస్ రోగులకు దివ్య ఔషధం. నాకే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా కూడా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలగే గుణం ఉంటుంది. ఇది శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఇంకా.. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా మధుమేహన్ని నియం తరించుటలో సహాయపడుతుంది.
Banana Flower రటి పువ్వు అద్భుతాలు
అలాగే అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వారికి అరటి పువ్వు అద్భుతంగా పనిచేస్తుంది. అరటి పువ్వు వారానికి ఒక్కసారి అయినా సరే ఆహారంలో భాగం చేసుకుంటే.. యాంటీ హైపర్ టెన్సివ్ ఏజెంట్ పని చేస్తుంది . ఇది రక్తపోటును కూడా నియంత్రించగలదు. అరటి పువ్వులో పీచు అధికంగా ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, అనేక పోషకాలు,అనేక ఇతర వ్యాధులను దివ్య ఔషధంగా పనిచేస్తుంది.అలాగే అరటి పండులో ఐరన్ ఉన్నట్లుగానే, పువ్వులో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఏంటి పండులో ఉన్న పోషకాలని అరటి పువ్వులో కూడా ఉంటాయి. ఇది శరీరంలో రక్తం లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. కావున రక్తహీనత తగ్గుతుంది. అలాగే అరటి పువ్వులో జింక్ కూడా అధికంగా ఉంటుంది. అధికంగా ఉండడం వల్ల ఎముకలు నష్టాన్ని నివారిస్తుంది. ఈ పువ్వులో క్వేర్సెటిన్, కాటే చిన్ అనే ఆంటీ ఆక్సిడెంట్లు ఎముకల నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి.
Banana Flower అరటి పువ్వులతో చర్మానికి సంబంధించిన సమస్యలను నివారించవచ్చు. అరటి పువ్వు ఆంటీ హిష్టమైన్ లక్షణాల్లో కలిగి ఉంటుంది. అందువల్ల అలర్జీలో తగ్గించటంలో సహాయపడుతుంది. అరటి పువ్వులో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గటంలో కూడా సహాయపడుతుంది. అరటి పువ్వులో ప్లేవనాయిడ్లు, టానిన్లు,యాంటీ ఆక్సిడెంట్లు రాడికల్ తో పోరాడడానికి, ఆక్సీకరణ నష్టాన్ని కూడా తొలగిస్తాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది.అరటిపండు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, ఆరోగ్య ప్రయోజనాలు అరటి పువ్వులో కూడా ఉన్నాయి. ఈ అరటిని కాయగా ఉన్నప్పుడు, కూరగా వండుకొని వినియోగిస్తారు. పండినప్పుడు ఫలంగా తింటారు. అలాగే అరటి పువ్వును కూడా అదే విధంగా వంటలో వినియోగించుకొని వండుకొని తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం అరటి పువ్వుని వంటల్లో వినియోగించుకోండి. మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.