Akira Nandan : అకీరా నందన్ సినీ ఎంట్రీ గురించి పూనకాలు తెప్పించే అప్‌డేట్ ఇచ్చిన రామ్ చరణ్
ప్రధానాంశాలు:
Akira Nandan : అకీరా నందన్ సినీ ఎంట్రీ గురించి పూనకాలు తెప్పించే అప్‌డేట్ ఇచ్చిన రామ్ చరణ్
Akira Nandan : పవన్ కళ్యాణ్ Pawan Kalyan రేణూ దేశాయ్‌ల తనయుడు అకీరా నందన్ సినీ ఎంట్రీ గురించి కొద్ది రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడైన అకిరా ఎప్పుడెప్పుడు సినిమాల్లో వస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అకిరా సినిమాల్లోకి వస్తాడో రాడో కూడా తెలియదు. దీనిపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడారు.అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోలో పాల్గొన్న ఆయన అకీరా నందన్ సినిమా ఎంట్రీపై స్పందించారు. `ఓజీ` సినిమాలో అకీరా కనిపిస్తాడట అని బాలయ్య అడిగిన ప్రశ్నకి విభిన్నంగా స్పందించారు.
Akira Nandan పూనకాలు తెప్పించే న్యూస్..
ఏమో ఓజీలో కనిపించినా ఆశ్చర్యం లేదు అనేలా హింట్ ఇచ్చాడు. `ఓజీ`తో అకీరా ఎంట్రీ ఉండబోతుందనే విషయాన్ని రామ్ చరణ్ చెప్పకనే చెప్పాడు.ఇటీవల ప్రోమోలో ఆ విషయమే చెప్పారు. కానీ పూర్తి ఎపిసోడ్‌లో ఆయన అకీరా గురించి స్పందించినట్టు తెలుస్తుంది. చరణ్ ఎపిసోడ్ ఈ రోజు(జనవరి 8న) టెలికాస్ట్ కానుంది. ఇందులో బాబాయ్ పవన గురించి, తమ్ముడు అకీరా గురించి చరణ్ ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక చరణ్ తో పాటు శర్వానంద్, నిర్మాత దిల్ రాజులు ఈ షోలో పాల్గొన్నారు. చరణ్ ప్రస్తుతం `గేమ్ ఛేంజర్ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు.
ఈ నెల 10న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ఈ సినిమా పై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.