నేర నివారణపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ మలిక గర్గ్
prakasam: మార్కాపురం : జిల్లాలో నేర నివారణపై ప్రత్యేక దృష్టి సారించామని మలికగర్గ్ తెలిపారు. గురువారం మార్కాపురం డివిజన్‌లో ఎస్పి పర్యటించారు. స్థానిక ఎస్టిపిఒ కార్యాలయ ఆవరణలో ఒఎపడి కార్యాలయం క్వార్టర్లు, పట్టణ పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాలను ఆమె పరిశీలించారు.మార్కాపురం పట్టణ పోలీస్ చేషన్‌లో రికార్డులు పరిశీలించిన అనంతరం జిల్లా కేంద్రంలోని డిఎస్‌పి కార్యాలయంలో మొక్కలు నాటారు.
అనంతరం ఎస్పి మాట్లాడుతూ జిల్లాలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని నియంత్రణకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక అధికారులతో చర్చించారు. ప్రజల రక్షణ మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.ముఖ్యంగా మహిళల సంరక్షణ చర్యలలో రాజీ పడకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి కిశోర్ కుమార్, సిఐ బిటి నాయక్, ఎస్ఐలు కోటయ్య, రామకృష్ణ, నాగరాజు పాల్గాన్నారు.
prakasam: గ్రామాల్లో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం: ఎస్పీ మలిక్ గర్గ్
పట్టణాలు, గ్రామాల్లో అసాంఘిక శక్తుల ఎక్కవతుండటంతో వెంటనే వాటిపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ మలిక గర్గ్ అధికారులను ఆదేశించారు. గిద్దలూరు పోలీసుస్టేషన్‌ను పరిశీలించిన ఎస్పీ కేసుల వివరాలపై ఆరా తీశారు. అక్కడున్న మహిళా పోలీసులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం సేషన్ పరిసరాలను పరిశీలించి, శిథిలమైన క్వార్టర్స్‌పై నివేదికను ఇవ్వాని సూచించారు.