Virata Parvam Movie Review : విరాటపర్వం మూవీ ఫస్ట్ రివ్యూ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virata Parvam Movie Review : విరాటపర్వం మూవీ ఫస్ట్ రివ్యూ

 Authored By gatla | The Telugu News | Updated on :16 June 2022,11:59 pm

ఈ సినిమా డైరెక్టర్ వేణు ఊడుగుల ఇంతకుముందు నీదీ నాదీ ఒకే కథ అనే సినిమాను తీశాడు. ఆ సినిమా తర్వాత ఆయన నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమా 1992 లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వేణు తెరకెక్కించాడు. అది ఒక మర్డర్ మిస్టరీ. దానికి కాస్త ప్రేమకథను జోడించి కథగా రాసుకొని విరాటపర్వంగా తెరకెక్కించాడు వేణు. సాయిపల్లవి పాత్రే ప్రధానంగా ఈ సినిమాలో హీరో అంటే సాయి పల్లవే అని చెప్పాలి. ఎందుకంటే.. తన పాత్రే ఈ సినిమాకు హైలెట్. కామ్రెడ్ రవన్నగా ఈ సినిమాలో రానా నటించగా.. వెన్నెలగా సాయి పల్లవి నటించింది.

అలాగే.. కామ్రెడ్ భారతక్కగా ప్రియమణి నటించింది. అలాగే.. నవీన్ చంద్ర, నందితా దాస్ లాంటి వాళ్లు ప్రముఖ పాత్రల్లో నటించారు. మహాభారతంలోని విరాటపర్వాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ఆధారంగానే ఈ సినిమాకు విరాట పర్వం అనే పేరు పెట్టాడు దర్శకుడు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కోవిడ్ వల్ల లేట్ అయింది. ఇప్పటికే రానా.. భీమ్లా నాయక్ సినిమాలో నటించాడు. ఆ సినిమా తర్వాత రానా నుంచి వస్తున్న సినిమా ఇదే. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ ను యూఎస్ లో వేశారు.

Virata Parvam Movie Review And Live Updates

Virata Parvam Movie Review And Live Updates

Virata Parvam Movie Review : విరాటపర్వం మూవీ ఫస్ట్ రివ్యూ

Virata Parvam Movie Review : సినిమా పేరు : విరాట పర్వం
నటీనటులు : రానా, సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్, జరీనా వాహబ్, ఈశ్వరీ రావు, నవీన్ చంద్ర, సాయి చంద్ తదితరులు
దర్శకత్వం : ఊడుగుల వేణు
మ్యూజిక్ డైరెక్టర్ : సురేశ్ బొబ్బిలి
నిర్మాతలు : సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి
విడుదల తేదీ : 17 జూన్ 2022
విరాటపర్వం అనేది పేరుకు చిన్న సినిమానే కావచ్చు కానీ.. ఆ సినిమా వెనుక ఉన్న కష్టం, ప్రయత్నం చాలా పెద్దది. దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఇంకొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా కల్పిత కథ కాదు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా. మరి.. ఈ సినిమా లైవ్ అప్ డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి..

సినిమా స్టార్ట్ అయింది. సినిమా నిడివి 150 నిమిషాలు. అంటే రెండున్నర గంటలు. సినిమా 1973 లో ప్రారంభం అవుతుంది. వెన్నెల అప్పుడే పుడుతుంది. వెన్నెలను నివేత పేతురాజ్ ఎత్తుకుంటుంది. చాలా సంతోషిస్తుంది. రాహుల్ రామకృష్ణ కూడా ఆ సీన్ లో కనిపిస్తాడు.

సినిమా పేర్లు పడుతుండగా.. సాయిపల్లవి గురించి చెబుతారు. తన తల్లిదండ్రుల గురించి ఇంట్రడక్షన్ వస్తుంది. తన తల్లిదండ్రులుగా ఈశ్వరీ రావు, సాయి చంద్ నటించారు.

రానా దగ్గుబాటిని ఒక రచయిత, మావోయిస్టుగా చూపిస్తారు. ఆయన పేరు అరణ్య అలియాస్ రవన్న. స్టోరీ మొత్తం తెలంగాణ నేపథ్యంలో సాగుతూ ఉంటుంది.

రానా తల్లిగా జరినా వాహబ్ నటించింది. సివిల్ రైట్ యాక్టివిస్ట్ శకుంతలగా నందితా దాస్ నటించింది. రానాకు ఈ సినిమాలో 50 నిమిషాల స్క్రీనింగ్ స్పేస్ మాత్రమే ఉంది. అలాగే.. ప్రియమణి, నవీన్ చంద్రలు కూడా కాసేపు సినిమాలో కనిపిస్తారు.

ఫస్ట్ హాఫ్ ముగియడానికి ముందే.. ఒక గన్ ఫైట్ ఉంటుంది. అందులో రానా ఇన్వాల్వ్ అవుతాడు. బెనర్జీ పోలీస్ గా నటించాడు. అలా ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.

సెకండ్ హాఫ్ ప్రారంభం అయ్యాక.. రానా, సాయిపల్లవి ఇద్దరూ కలుస్తారు. వాళ్ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. కొన్న ఎమోషనల్ సీన్స్ వస్తాయి. ఇంతలో నాగదారిలో అనే పాట వస్తుంది. ఆ తర్వాత మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఒక వార్ జరుగుతుంది.

ఆ తర్వాత క్లైమాక్స్. సినిమా మొత్తానికి సాయి పల్లవే హైలెట్. తనే హీరోయిన్. నవీన్ చంద్ర, ప్రియమణి క్యారెక్టర్స్ కూడా సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది