Ayodhya Ram Mandir History : అయోధ్య రామ మందిరం వివాదం ఎందుకు మొద‌లైంది.. ఈ స్థ‌లం వెనుక ఉన్న చ‌రిత్ర ఎంటో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ayodhya Ram Mandir History : అయోధ్య రామ మందిరం వివాదం ఎందుకు మొద‌లైంది.. ఈ స్థ‌లం వెనుక ఉన్న చ‌రిత్ర ఎంటో తెలుసా..?

Ayodhya Ram Mandir History : ఉత్తర భారత దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘజియాబాద్ జిల్లాలో ఉన్న అయోధ్య శ్రీరాముడి జన్మభూమి. అయోధ్యలో శ్రీరాముడు జనవరి 10, 5114BC లో శుక్లపక్షంలో చైత్రమాసంలో జన్మించారు. అంటే దాదాపుగా రాముడు పుట్టి 7123 సంవత్సరాలు అవుతుంది. ఇక రాముడు తన అవతారాన్ని విడిచి వైకుంఠానికి చేరుకున్న తర్వాత అక్కడి ప్రజలు శ్రీరాముడికి గుర్తుగాను అయోధ్యలో గుడి కట్టి పూజలు చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1528 – 1529 […]

 Authored By aruna | The Telugu News | Updated on :22 January 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Ayodhya Ram Mandir History : అయోధ్య రామ మందిరం వివాదం ఎందుకు మొద‌లైంది.. ఈ స్థ‌లం వెనుక ఉన్న చ‌రిత్ర ఎంటో తెలుసా..?

Ayodhya Ram Mandir History : ఉత్తర భారత దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘజియాబాద్ జిల్లాలో ఉన్న అయోధ్య శ్రీరాముడి జన్మభూమి. అయోధ్యలో శ్రీరాముడు జనవరి 10, 5114BC లో శుక్లపక్షంలో చైత్రమాసంలో జన్మించారు. అంటే దాదాపుగా రాముడు పుట్టి 7123 సంవత్సరాలు అవుతుంది. ఇక రాముడు తన అవతారాన్ని విడిచి వైకుంఠానికి చేరుకున్న తర్వాత అక్కడి ప్రజలు శ్రీరాముడికి గుర్తుగాను అయోధ్యలో గుడి కట్టి పూజలు చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1528 – 1529 మధ్యలో బాపూర్ అనే నవాబు రాజు అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని కూల్చేసి బాబ్రీ మసీదును కట్టించారు. దీంతో హిందువులకు, ముస్లింలకు ఎన్నో గొడవలు జరిగాయి. అయితే అక్కడ విశ్వహిందూ పరిషద్ అనే మూడు వర్గాలకు చెందిన వారు ఉండేవారు. అక్కడ ఉండే వీరు హిందూస్ ని రిప్రజెంట్ చేసేవారు. యూపీషి సెంట్రల్ వాక్ బోర్డ్ అనేవారు అక్కడి ముస్లింలను రిప్రజెంట్ చేసేవారు. నిర్మోహి అఖర అనే వీరు గుళ్లో పనిచేసే పూజారులను రిప్రజెంట్ చేసేవారు. ఇక ఇక్కడ ఉండే బాబ్రీ మసీద్ 2.77 ఎకరాల స్థలంలో ఉండేది. అయితే ఆ స్థలం ముస్లింలకు చెందినదని, ఆ స్థలాన్ని హిందువులు దోచుకొని రామ మందిరాన్ని కట్టారని, అంతే కాకుండా అది రాముడి జన్మభూమి అనడానికి బలమైన సాక్షాలు లేవని కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు.

Ayodhya Ram Mandir అయోధ్య మందిరంలో లోపలి ప్రాంగణం ఎంత వైభవంగా ఉందో వీక్షించారా

Ayodhya Ram Mandir : అయోధ్య మందిరంలో లోపలి ప్రాంగణం ఎంత వైభవంగా ఉందో వీక్షించారా…?

1957లో నవాబులకు బ్రిటిష్ వాళ్లకి పెద్ద యుద్ధం జరిగింది. చివరికి ఆ యుద్ధంలో బ్రిటిష్ వారు గెలిచారు. దాంతో నవాబుల పాలన ముగిసింది. నవాబులు ముస్లిమ్స్ కావడంతో హిందువులు రాముడి జన్మభూమి అయోధ్య అని ఎన్ని గొడవలు చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ముస్లింలకు, హిందువులకు గొడవలు జరిగాయి. అక్కడికి మసీదు అధికారి అయిన మహమ్మద్ అజ్గర్ బ్రిటిష్ వాళ్లకు కంప్లైంట్ చేశారు. రెండోసారి నిర్మోహి అఖర అనే సంస్థ 1983లో ఆలయం నిర్మాణం కోసం అనుమతి కోరుతూ డిప్యూటీ కమిషనర్ కు అప్లికేషన్ ఇచ్చారు. కానీ ముస్లింలు అందుకు అంగీకరించనివ్వకుండా గొడవలు చేశారు. మే 1983లో లాహోరికి చెందిన గురు సింగ్ అనే పంజాబీ వ్యక్తి రాళ్లు ఇతర నిర్మాణ వస్తువులతో పాటు అయోధ్యకి వచ్చి రాముడికి మందిరం కట్టాలని నిరసనలు తెలిపాడు. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

1985లో నిర్మోహి అఖర సంస్థకి చెందిన మహంత్ర వరుదాస్ అనే వ్యక్తి అది రాముడి జన్మభూమి అని ఖచ్చితంగా రామ మందిరాన్ని కట్టి తీరాలని సివిల్ కోర్టులో మొట్టమొదటిసారి పిటీషన్ వేశారు. అయితే మసీదును కూల్చేసి అక్కడ మందిరం కడితే ముస్లింలకు హిందువులకు గొడవలు వస్తాయని కేసును కొట్టివేశారు. తర్వాత రెండోసారి అక్కడి జిల్లాలో కేసును రీఓపెన్ చేశారు. అయోధ్య రాముడు జన్మభూమి రామ మందిరాన్ని కూల్చేసి మసీదుని కట్టడం చాలా బాధాకరమని, అది జరిగి అప్పటికే 230 సంవత్సరాలు అయిందని, పాత కేసుకు సమన్వయం చెప్పడం తీర్పు కాదని, మళ్లీ మరోసారి కేసును డిస్మిస్ చేశారు. కానీ మసీదును కూల్చడానికి అనుమతి ఇవ్వలేం కానీ మసీదు బయట ఉన్న ఎత్తైన ఫ్లాట్ఫామ్ మీద హిందువులు పూజ చేసుకోవచ్చని చెప్పారు. దీంతో హిందువులు చెక్కతో తయారుచేసిన సీతారాముల విగ్రహాన్ని పెట్టి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇలా మసీదు లోపల ముస్లింలు బయట హిందువులు పూజ చేసుకునేవారు.

Ayodhya Ram Mandir అయోధ్య మందిరంలో లోపలి ప్రాంగణం ఎంత వైభవంగా ఉందో వీక్షించారా

Ayodhya Ram Mandir : అయోధ్య మందిరంలో లోపలి ప్రాంగణం ఎంత వైభవంగా ఉందో వీక్షించారా…?

అయితే 1949లో కొంతమంది హిందువులు రాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా మసీదు లోపల చొరబడి సీతారాముల విగ్రహాన్ని పెట్టారు. మరుసటి రోజు అది చూసిన ముస్లింలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దాంతో హిందువులకు ముస్లింలకు గొడవలు జరుగుతున్నాయని మసీదును, ఫ్లాట్ఫామ్ పై ఉన్న రాముడు గోపురాన్ని లాక్ చేసి క్లోజ్ చేశారు. 1986లో విశ్వహిందూ పరిషత్ సంస్థ చెందిన వారు అక్కడ హిందువులకు పూజలు చేసుకునే పర్మిషన్ ఇప్పించాలని కోర్టులో పిటిషన్ వేశారు. అందుకు కోర్టు ఒప్పుకోవడంతో 37 సంవత్సరాల తర్వాత గుడి గేట్లు తెరిచాయి. ఇదే మంచి సమయం అని భావించిన సంస్థ ఆ ల్యాండ్ కూడా మాకే ఇవ్వండి అని, ఇక్కడ గుడి కట్టుకుంటామని డిమాండ్ చేశారు. మిగిలిన సంస్థలు కూడా భూమి వారిదే అని డిమాండ్ చేశాయి.

Ayodhya Ram Mandir అయోధ్య‌పురిలో కొలువుదీరిన బాల‌రాముడు లోపలి ప్రాంగణం ఎంత వైభవంగా ఉందో వీక్షించారా

Ayodhya Ram Mandir : అయోధ్య‌పురిలో కొలువుదీరిన బాల‌రాముడు.. లోపలి ప్రాంగణం ఎంత వైభవంగా ఉందో వీక్షించారా…?

విశ్వహిందూ పరిషత్ సంస్థకి పొలిటికల్గా బీజేపీ ఎంతో మద్దతు ఇచ్చింది. 1992లో విశ్వహిందూ పరిషత్ బీజేపీ కలిసి 2.77 ఎకరాల చుట్టూ పెద్ద మహాసభను ఏర్పాటు చేశారు. ఆ సభకు దేశ నలమూలనుంచి పెద్ద ఎత్తున హిందువులొచ్చారు. ఎల్కే అద్వానీ, వాజ్ పేయి వంటి వారు స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయారు. వారు వెళ్లిన తర్వాత కొందరు మసీదు పైకెక్కి జైశ్రీరామ్ అంటూ మసీదును పగలగొట్టడం మొదలుపెట్టారు. అలా మసీదు మొత్తాన్ని కూల్చేసి చివరికి చిన్న గుడిని కట్టారు. ఆ గొడవలు దాదాపుగా 10వేల నుంచి 15 వేల మంది చనిపోయారు. ఇక ఆ తర్వాత 2010లో అలహాబాద్ కోర్టు 2.77 ఎకరాల స్థలాన్ని మూడు ఆర్గనైజేషన్లు సమానంగా పంచుకోమని చెప్పింది. కానీ అది ఎవరికీ నచ్చకపోవడంతో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆ 2.77 ఎకరాల స్థలం ఎవరిదో ఆధారాలు చూపిస్తే వారికి స్థలం అని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఇన్వెస్టిగేషన్ జరిపించింది. 1717 లో రాజ్ పుత్ వంశానికి చెందిన జై సింగ్ అనే రాజు 2.77 ఎకరాల భూమిని కొని శ్రీరాముడు పేరు మీద రాశాడని ఆధారం దొరికింది. దీంతో చివరికి 2019లో ఈ స్థలం హిందువులకే చెందుతుందని ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. దీంతో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న గొడవలు తీరిపోయాయి. ఫైనల్ గా శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో రామ మందిరం నిర్మించడం జరిగింది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది