CSK : చెన్నైని క‌ష్టాల‌లోకి నెట్టిన గుజ‌రాత్.. ర‌స‌వ‌త్త‌రంగా మారిన ప్లేఆఫ్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

CSK : చెన్నైని క‌ష్టాల‌లోకి నెట్టిన గుజ‌రాత్.. ర‌స‌వ‌త్త‌రంగా మారిన ప్లేఆఫ్‌..!

CSK : ఐపీఎల్ సీజ‌న్ 17 రోజు రోజుకి ర‌స‌వ‌త్తరంగా మారుతుంది. ఏయే జ‌ట్లు ప్లేఆఫ్స్‌కి వెళ‌తాయ‌నేది చెప్ప‌డం కొంత లేట‌య్యేలా ఉంది. ఆర్ఆర్, కోల్‌క‌తా జట్లు దాదాపు ప్లేఆఫ్స్‌కి చేరుకోగా, మిగ‌తా రెండు స్థానాల కోస‌మే ఫైట్ నడుస్తుంది. అయితే గ‌త రాత్రి అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన పోరులో 35 పరుగుల తేడాతో గుజ‌రాత్ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ఆ జ‌ట్టు ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవంగానే ఉన్నాయి. ఇక చెన్నై […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 May 2024,10:50 am

CSK : ఐపీఎల్ సీజ‌న్ 17 రోజు రోజుకి ర‌స‌వ‌త్తరంగా మారుతుంది. ఏయే జ‌ట్లు ప్లేఆఫ్స్‌కి వెళ‌తాయ‌నేది చెప్ప‌డం కొంత లేట‌య్యేలా ఉంది. ఆర్ఆర్, కోల్‌క‌తా జట్లు దాదాపు ప్లేఆఫ్స్‌కి చేరుకోగా, మిగ‌తా రెండు స్థానాల కోస‌మే ఫైట్ నడుస్తుంది. అయితే గ‌త రాత్రి అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన పోరులో 35 పరుగుల తేడాతో గుజ‌రాత్ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ఆ జ‌ట్టు ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవంగానే ఉన్నాయి. ఇక చెన్నై ప్లే ఆఫ్ అవ‌కాశాల‌ని కాస్త సంక్లిష్టం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. గుజరాత్ ఓపెనర్లలో సాయి సుదర్శన్ (103; 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (104; 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్) సెంచరీల‌తో స‌త్తా చాట‌డంతో గుజ‌రాత్ భారీ స్కోర్ చేసింది.

CSK : క‌ష్టాల్లో సీఎస్కే

12.4 ఓవర్లలో గుజరాత్ 150, 16.2 ఓవర్లలో 200 స్కోరు మార్క్‌ను అందుకుంది. అయితే సెంచరీ సాధించిన తర్వాత గిల్, సుదర్శన్ వెంట‌వెంట‌నే ఔట‌య్యారు. 18వ ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరిని తుషార్ దేశపాండే పెవిలియన్‌కు చేర్చ‌డంతో గుజరాత్ స్కోరు వేగం త‌గ్గంది. అయితే 20 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి 231 ప‌రుగులు చేశారు. ఇక భారీ ల‌క్ష్య చేధ‌న‌తో బ‌రిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. రచిన్ రవీంద్ర (1; 2 బంతుల్లో), ఇంపాక్ట్ ప్లేయర్ అజింక్య రహానె (1; 5 బంతుల్లో), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (డకౌట్; 3 బంతుల్లో) వరుసగా ఔట్ కావ‌డంతో ఇబ్బందుల్లో ప‌డింది. అయితే ఆ స‌మ‌యంలో బ్యాటింగ్‌కు వచ్చిన అలీ, మిచెల్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 57 బంతుల్లో 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

CSK చెన్నైని క‌ష్టాల‌లోకి నెట్టిన గుజ‌రాత్ ర‌స‌వ‌త్త‌రంగా మారిన ప్లేఆఫ్‌

CSK : చెన్నైని క‌ష్టాల‌లోకి నెట్టిన గుజ‌రాత్.. ర‌స‌వ‌త్త‌రంగా మారిన ప్లేఆఫ్‌..!

మోహిత్ శర్మ బౌలింగ్‌లో షాట్ ఆడిన మిచెల్.. షారూక్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా, మెయిన్ అలీ కూడా నూర్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. శివమ్ ధూబే (21) పరుగులతో రాణించగా, ఓపెనర్ అజింక్య రహానే (1), రచిన్ రవీంద్ర (1) పేలవ ప్రదర్శనతో చేతులేత్తేశారు. రుత్‌రాజ్ గైక్వాడ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ధోని చివర‌లో కాస్త మెరుపులు మెరిపించిన కూడా పెద్ద‌గా ప్ర‌మోజనం లేకుండా పోయింది. ఇక అద్భుత సెంచరీతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన శుభమన్ గిల్ (104)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది