Ind vs ENG: టీమిండియాకి భారీ లక్ష్యం విధించిన ఇంగ్లండ్.. రాణించిన జడేజా
ప్రధానాంశాలు:
Ind vs ENG: తొలి వన్డేలో మంచి విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు రెండో వన్డేలోను నెగ్గాలనే కసితో ఉంది. అయితే కటక్ వేదికగా జరి
Ind vs ENG: తొలి వన్డేలో మంచి విజయం సాధించిన టీమిండియా India ఇప్పుడు రెండో వన్డేలోను నెగ్గాలనే కసితో ఉంది. అయితే కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ భారత్ కు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. కటక్‌లోని బారాబాటి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
![Ind vs ENG టీమిండియాకి భారీ లక్ష్యం విధించిన ఇంగ్లండ్ రాణించిన జడేజా](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/jaddu.jpg)
Ind vs ENG: టీమిండియాకి భారీ లక్ష్యం విధించిన ఇంగ్లండ్.. రాణించిన జడేజా
భారీ లక్ష్యం..
ఇంగ్లాండ్ తరపున బెన్ డకెట్ 65, జో రూట్ 69 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. కెప్టెన్ జోస్ బట్లర్ 34, హ్యారీ బ్రూక్ 31, ఫిల్ సాల్ట్ 26 పరుగులు చేశారు. భారత్ తరపున రవీంద్ర జడేజా Jadeja 3 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు.
సిరీస్‌లో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో రూట్ రాణించాడు. రూట్ Root తనదైన శైలిలో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. బ్రూక్‌తో మూడో వికెట్‌కు 66 పరుగులు, బట్లర్‌తో నాలుగో వికెట్ కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం దిశగా దూసుకువెలుతున్న అతడిని రవీంద్ర జడేజా ఐదో వికెట్ గా పెవిలియన్‌కు చేర్చాడు. ఆఖరిలో లియామ్ లివింగ్ స్టోన్ వేగంగా ఆడడంతో స్కోరు మూడు వందలు దాటింది.