Oppo Reno14 5g : రూ.40వేలలో బెస్ట్ ఛాయిస్.. కెమెరా, డిజైన్, AI ఫీచర్లతో ..!
ప్రధానాంశాలు:
Oppo Reno14 5g : రూ.40వేలలో బెస్ట్ ఛాయిస్.. కెమెరా, డిజైన్, AI ఫీచర్లతో ..!
Oppo Reno 14 5g : సాధారణంగా రూ.40 వేల లోపల అందుబాటులో ఉండే స్మార్ట్‌ఫోన్‌లు ఫీచర్ల పరంగా కొన్ని పరిమితులతో వస్తుంటాయి. అయితే OPPO Reno14 5G మాత్రం దానిన చెరిపేసే ప్రయత్నం చేసింది. పనితీరు, కెమెరా సామర్థ్యం, డిజైన్, ఎడిటింగ్ టూల్స్ అన్నింటికీ ఒకే లెవెల్‌లో సమతుల్యత చూపిస్తూ, నిజంగా వావ్ అనిపించే అనుభవం ఇచ్చేందుకు వస్తోంది.

Oppo Reno14 5g : రూ.40వేలలో బెస్ట్ ఛాయిస్.. కెమెరా, డిజైన్, AI ఫీచర్లతో ..!
Oppo Reno 14 5g : బెస్ట్ ఫీచర్స్‌తో..
Reno14 5G ప్రత్యేకతల్లో ముందు వరుసలో నిలిచేది 50MP టెలిఫోటో లెన్స్. 3.5x జూమ్, 80mm ఫోకల్ లెంగ్త్‌తో ఇది ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు సరిపోయే స్థాయిలో ఉంటుంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఇలాంటి కెమెరా అరుదు. సినిమాటిక్ డెప్త్, సహజమైన బ్యాక్‌గ్రౌండ్, స్పష్టమైన ఫేషియల్ డీటెయిల్స్ – ఇవన్నీ ఈ లెన్స్ సౌలభ్యాలు.
ఈ కెమెరా సెటప్‌ను AI ట్రిపుల్ ఫ్లాష్ సిస్టమ్ తో కూడా ప్యాకేజీ చేశారు. ప్రతి లెన్స్‌కి ప్రత్యేకమైన ఫ్లాష్ ఉండటం ద్వారా తక్కువ వెలుతురు వాతావరణంలోనూ మంచి ఫలితాలు దొరుకుతాయి. 4K వీడియో రికార్డింగ్, అది కూడా 60fps వద్ద ఫ్రంట్, బ్యాక్ కెమెరాలలో, AI స్టెబిలైజేషన్, ఆటో ఫోకస్ వంటి ఫీచర్లు సహా AI Editor 2.0 ద్వారా గ్లాస్ రిఫ్లెక్షన్ తొలగించడం, బ్యాగ్రౌండ్‌లో వ్యక్తుల తొలగింపు, ఫ్రేమ్ మళ్లీ కంపోజ్ చేసే సౌలభ్యం ఉంటుంది. ప్రత్యేకమైన అండర్‌వాటర్ మోడ్ ద్వారా నీటిలోనూ ఫోటోలు, 4K వీడియోలు తీయొచ్చు .6000mAh బ్యాటరీ, 80W SUPERVOOC ఛార్జింగ్ కేవలం 50 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. పెర్ల్ వైట్, ఫారెస్ట్ గ్రీన్ వేరియంట్లు ఆకర్షణీయంగా ఉండేలా డిజైన్ చేశారు