BRS : బీఆర్ఎస్‌కు కొత్త నాయకత్వం కోరుకుంటున్న కేడర్ ?
ప్రధానాంశాలు:
BRS : బీఆర్ఎస్‌కు కొత్త నాయకత్వం కోరుకుంటున్న కేడర్ ?
BRS : బీఆర్‌ఎస్ బలోపేతంపై ఆ పార్టీ అగ్రనాయకత్వం మీనమేషాలు లెక్కిస్తోందా? ఎమ్మెల్యేలు లేని చోట ఇన్‌చార్జుల నియామకంపై ఆసక్తి చూపకపోడానికి కారణమేంటి? ఇన్‌చార్జి పదవులు కావాలని స్థానిక నాయకత్వం పార్టీ వెంటపడుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు.. సమర్థులు లేరనే భావనా… ఇంకా టైం ఉందన్న ఆలోచనా… ఇన్‌చార్జులు లేక.. తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక దిగువస్థాయిలో క్యాడర్ కకావిలకమవుతున్నా అధిష్టానంలో చలనం ఉండటం లేదన్న ప్రచారంలో నిజమెంత ? వీటంన్నింటి నేపథ్యంలో బీఆర్ఎస్‌కు కొత్త నాయకత్వం అవసరం ఉందా ? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ క్రమంలో టీఆర్ఎస్ అంటే ప్రజలకు ఓ భరోసా. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ నేతృత్వంలో ఊరూరా గులాబీ జెండాలను ఎగురవేశారు. ప్రజలు కూడా బీఆర్ఎస్‌ను తమ ఇంటి పార్టీగా భావించి పెద్దఎత్తున ఆదరించారు. దాంతో తెలంగాణలో బీఆర్ఎస్ కు ఎదురులేకుండా పోయింది.
స్వరాష్ర్ట సాకారం అనంతరం సైతం బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారినప్పటికీ ప్రజలు ఆదరించి రెండు పర్యాయాలు అధికారం కట్టబెట్టారు. అంతేకాకుండా లోకల్ బాడీ నుంచి పార్లమెంట్ వరకు ఎన్నిక ఏదైనా అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు. దాంతో రెండు పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగారు.అయితే పార్టీకి ముందు నుంచీ కేసీఆరే అధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ కొనసాగుతున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ ఘోరంగా ఓటమి పాలైంది. అటు తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. దాంతో అప్పటి నుంచి పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వచ్చిందే లేదు. కేవలం ఫామ్‌హౌజ్‌కే పరిమితం అయ్యారు. ఓటమి గల కారణాలు, వైఫల్యాలపై సమీక్షించుకున్న దాఖలాలు లేవు. పైగా ప్రజలే తమ పార్టీని ఓడగొట్టి తప్పు చేశామని భావిస్తున్నట్లుగా పార్టీ అగ్ర నాయకత్వం తమ మాటల్లో వ్యక్తపరిచేది.
అధినేత కేసీఆర్ పరిస్థితి అలా ఉంటే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరి మరోలా ఉందని కేడర్‌లో టాక్. రాష్ట్రంలో కీలక సమయాల్లో ఆయన ఫారిన్ టూర్ వెళ్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కౌశిక్ వివాదం జరిగినప్పుడు ఆయన అందుబాటులో లేరు. అలాగే.. హైడ్రా కూల్చివేతల సమయంలోనూ లేరు. కేవలం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు. ఈ క్రమంలో హరీశ్ రావు లీడ్ తీసుకుని అధికార పక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్షేత్రస్థాయిలో ఆయన నిరసన కార్యక్రమాలకు పూనుకున్నారు. అటు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖలు రాశారు.

BRS : బీఆర్ఎస్‌కు కొత్త నాయకత్వం కోరుకుంటున్న కేడర్ ?
హైడ్రా కూల్చివేతలు, ఖమ్మం వరదలు, మూసీ ప్రక్షాళన వంటి ప్రజలు తీవ్రంగా ప్రభావమయ్యే అంశాల్లోనూ కేసీఆర్ బయటకు రాలేదు. కనీసం ఒక ప్రకటన సైతం విడుదల చేయలేదు. వీటన్నింటి నేపథ్యంలో కేడర్ తీవ్ర నైరాశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌ను వీడి వచ్చేది లేదని.. కేటీఆర్ నుంచి సరైన సమయంలో స్పందన ఉండడం లేదని పార్టీలో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ నాయకత్వం మారితేనైనా పార్టీకి పూర్వవైభవం వస్తుందని వస్తదని క్యాడర్ భావిస్తుంది. లేదంట భవిష్యత్ మరింత అంధకారమే అవుతుందని పేర్కొంటున్నారు.