Chicken : బ్రేకింగ్‌.. చికెన్ తినొద్దు : తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chicken : బ్రేకింగ్‌.. చికెన్ తినొద్దు : తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక..!

 Authored By prabhas | The Telugu News | Updated on :11 February 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Chicken : బ్రేకింగ్‌.. చికెన్ తినొద్దు : తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక..!

Chicken : తెలంగాణ ప్రభుత్వం Telangana Govt మంగళవారం త‌న పౌరుల‌కు కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రజలు కొన్ని రోజుల వ‌ర‌కు చికెన్ తినొద్ద‌ని హెచ్చరించింది. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రేవంత్ స‌ర్కార్ సూచించింది. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు వ్యాపించినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమడోలు, కొల్లేరు కాకినాడ, ఏలూరులో కోళ్లు చనిపోవడంతో కోళ్ల రక్త నమూనాలు తీసి భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపిన‌ట్లు పశుసంవర్ధకశాఖ అధికారులు తెలిపారు.

Chicken బ్రేకింగ్‌ చికెన్ తినొద్దు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక

Chicken : బ్రేకింగ్‌.. చికెన్ తినొద్దు : తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక..!

15 రోజులుగా వణికిస్తున్న వైరస్‌ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా H5N1 అని భోపాల్‌లోని యానిమల్‌ డిసీజెస్‌ ల్యాబ్‌ తేల్చింది. తణుకు మండలం వేల్పూరు, పెరవలి మండలం కానూరు గ్రామాల్లో చనిపోయిన కోళ్లకు హెచ్‌5ఎన్‌1 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో… చికెన్ తినొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఏపీలో చికెన్‌ తినే వారి సంఖ్య తగ్గింది. దీంతో రేట్లు కూడా ప‌డిపోయాయి.

తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్‌గా ల్యాబ్‌లో నిర్ధారణ అయ్యింది. కానూరు పది కిలోమీటర్ల పరిధిలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒక కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్, 10 కిలోమీటర్ల పరిధిలో సర్వై లెన్స్ జోన్‌ ఏర్పాటు చేశారు. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణకు కార్యాచరణ చేపట్టారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది