Congress Party : కాంగ్రెస్ హైకమాండ్ ఓటు ఎటు.. పాపులారిటీకా..? సీనియారిటీకా..?
Congress Party : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ Congress Party (టీపీసీసీ) అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎంపిక చేయటం పూర్తయింది.. రేపో మాపో ప్రకటించటమే తరువాయి.. అని లేటెస్టుగా వార్తలు వచ్చాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో ఢిల్లీలో మకాం వేసిన రేవంత్ రెడ్డి Revanth reddy, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి komatireddy venkatreddy , భట్టి విక్రమార్క వంటివారు ఇంటికి వచ్చి ఉంటారు. హస్తం పార్టీ అధిష్టానం ఇలా లీకులు ఇవ్వటం పరిపాటిగా మారిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ కథ నాన్న పులి స్టోరీలా తయారైంది. హైకమాండ్ కి కూడా అర్థమైపోయినట్లుంది.. కొత్త అధ్యక్షుణ్ని పెట్టినా, పాత అధ్యక్షుణ్ని కొనసాగించినా పెద్దగా ఫలితమేమీ ఉండదని.
ఆ గ్యాప్ ఎప్పుడూ.. Congress Party
కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు, అధిష్టానానికి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. కార్యకర్తలు, నాయకులు గల్లీల్లో ఉంటే హైకమాండేమో ఢిల్లీలో ఉంటుంది. ఈ ప్రభావం తెలంగాణలో మాత్రమే కాదు. దేశం మొత్తం కనిపిస్తోంది. పైగా.. కార్యకర్తలు, నాయకులు కోరుకునేది అధిష్టానానికి ఎప్పుడూ నచ్చదు. అందుకే.. వాళ్లు చెప్పిన నేతకు పగ్గాలను అప్పగించదు. పబ్లిక్ లో పాపులారిటీ ఉన్న లీడర్ రేప్పొద్దున మన మాట కూడా వినడేమో అనే అనుమానం కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పెనుభూతంలా ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అందుకే సీల్డ్ కవర్ సీఎంలతో నెట్టుకొచ్చేది. ముఖ్యమంత్రి విషయంలో అయితే ఏ పాలసీని ఫాలో అయినా అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అప్పటికే పార్టీ గెలిచి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసినా ఎవరూ ఏమీ అనరు అనే గుడ్డి విధానాన్ని గతంలో అమలుచేసేది.
రోజులు మారినా.. : Congress Party
ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ Congress Partyకి ఇప్పటి రోజులకి మధ్య చాలా తేడా ఉంది. అప్పట్లో ప్రాంతీయ పార్టీలు తక్కువ. దీంతో దేశవ్యాప్తంగా హస్తం పార్టీ హవా నడిచేది. ఇప్పుడు అలా కాదు. లోకల్ పార్టీలదే పైచేయి అవుతోంది. ప్రాంతీయ పార్టీల్లో ముఠా రాజకీయాలు చాలా వరకు తక్కువనే చెప్పాలి. ప్రజాస్వామ్యం కన్నా వ్యక్తి స్వామ్యం ఎక్కువగా ఉంటుంది. అదీ ఒకందుకు మంచిదే. పార్టీని క్రమశిక్షణగా నడపొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరికివారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు.
అందుకే ఇలా.. Congress Party
హస్తం పార్టీలో గ్రూపులు ఎక్కువ కావటం అధిష్టానానికి ఆటంకంగా మారింది. టీపీసీసీ చీఫ్ సెలక్షన్ లో అడుగు ముందుకు పడనీయట్లేదు. వి.హనుమంతరావు లాంటి సీనియర్లు పట్టుమని పది ఓట్లు తేలేరు. తెచ్చేవాణ్ని తేనీయరు. కాలం కలిసొస్తే కాంగ్రెస్ పార్టీ Congress Party దే విజయం అనే తత్వంవాళ్లది. అలాంటివాళ్లను పూర్తిగా పక్కన పెట్టకపోయినా, రేవంత్ రెడ్డి లాంటి పాపులారిటీ కలిగిన లీడర్ కి త్వరగా బాధ్యతలు అప్పగించకపోయినా హస్తం పార్టీకి ఫ్యూచర్ లో కాలం కలిసి రావటం అంటూ ఉండదు. కాలగర్భంలో కలిసి పోవటం తప్ప.