Trs Mp : బీజేపీలో చేరికపై టీఆర్ఎస్ ఎంపీ క్లారిటీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trs Mp : బీజేపీలో చేరికపై టీఆర్ఎస్ ఎంపీ క్లారిటీ..!

 Authored By kondalrao | The Telugu News | Updated on :19 June 2021,9:15 pm

Trs Mp : రాష్ట్ర మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్.. బర్తరఫ్ కి గురైన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ని రాజ్యసభ సభ్యుణ్ని చేసి కేంద్ర మంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలని కమలం పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా కాషాయం పార్టీతోపాటు ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కి ఝలక్ ఇవ్వాలని చూస్తున్నారు. అదే సమయంలో కారు పార్టీకే చెందిన మరికొందరు ఈటల బాటలో నడవబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఒక ఎంపీ బీజేపీలోకి జంప్ చేయబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. ఆ పార్లమెంట్ సభ్యుడి పేరు బీబీ పాటిల్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీ. అయితే తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై బీబీ పాటిల్ ఇవాళ శనివారం సీరియస్ గా స్పందించారు.

mp jaheerabad TRS mp given clarity on joining in bjp

నకరాల్ చేయొద్దు.. నాతో పెట్టుకోవద్దు..

తన గురించి ఈవిధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటానని బీబీ పాటిల్ హెచ్చరించారు. పనికిమాలినోళ్లు వేస్తున్న చిల్లర వేషాలివి అని మండిపడ్డారు. తుది శ్వాస విడిచే వరకు గులాబీ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలకి, తనకి మధ్య ఎలాంటి విభేదాలూ లేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ అండదండలతో, స్థానిక శాసన సభ్యుల సహకారంతోనే తాను రెండోసారి కూడా ఎంపీగా గెలిచానని అన్నారు. జహీరాబాద్ జనాలు తన పట్ల చూపుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక కొందరు ఇలాంటి నీచానికి ఒడిగడుతున్నారని బీబీ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP

BJP

కొసమెరుపు ఏంటంటే..: Trs Mp

బీబీ పాటిల్ నిజంగానే బీజేపీలోకి వెళ్లడేమో గానీ పార్టీ మారే ముందు ప్రతి ఒక్క నాయకుడూ చెప్పే సెంటిమెంటల్ డైలాగ్ ఒకటుంది. ‘‘కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇదే పార్టీలో ఉంటా’’. ఈ మాట చెప్పారంటే వాళ్లు ఖచ్చితంగా పార్టీ మారబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో చాలా మంది ఇదే డైలాగ్ కొట్టి సొంత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈటల రాజేందర్ ని కేంద్ర మంత్రిని చేయబోతున్నట్లు చెబుతున్న బీజేపీ.. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో ఆయన భార్య జమునను బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> Lock Down : తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ ఎత్తివేత.. ఫస్ట్ తారీఖు నుంచి స్కూళ్లు, కాలేజీలు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> వైఎస్ ష‌ర్మిల‌ ఎఫెక్ట్‌.. ఈ టీఆర్ఎస్ నేత‌కు మంత్రి ప‌ద‌వి..?

ఇది కూడా చ‌ద‌వండి ==> TRS : ఆ మాట ఎత్తినవాళ్లందరికీ.. ఇదే గతి?..

ఇది కూడా చ‌ద‌వండి ==> Chandra Babu : ఆ పోస్టు కోసం.. చంద్రబాబు వెతుకుతున్న వ్యక్తి ఎవరో?..

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది