Hydra : ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్‌ల‌కి తేడా ఏంటి.. హైడ్రా వాటిని కూల్చ‌డానికి కార‌ణాలు ఏంటి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hydra : ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్‌ల‌కి తేడా ఏంటి.. హైడ్రా వాటిని కూల్చ‌డానికి కార‌ణాలు ఏంటి ?

Hydra : రేవంత్ స‌ర్కార్ త‌గ్గేదే లే అంటుంది. అక్ర‌మాలు చేసిన వారిని వ‌దిలేదేలే అంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించమని తేల్చి చెబుతోంది. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు చర్యలు తీసుకుంటుంది. అక్రమ నిర్మాణాల లిస్ట్‌ను హైడ్రా అధికారులు సిద్ధం చేశారు. మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్‌‌లో కొంతభాగం ఆక్రమించిందే. దాంతో ఆ నిర్మాణాలను అధికారులు కూల్చి వేస్తున్నారు.హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 August 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Hydra : ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్‌ల‌కి తేడా ఏంటి.. హైడ్రా వాటిని కూల్చ‌డానికి కార‌ణాలు ఏంటి ?

Hydra : రేవంత్ స‌ర్కార్ త‌గ్గేదే లే అంటుంది. అక్ర‌మాలు చేసిన వారిని వ‌దిలేదేలే అంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించమని తేల్చి చెబుతోంది. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు చర్యలు తీసుకుంటుంది. అక్రమ నిర్మాణాల లిస్ట్‌ను హైడ్రా అధికారులు సిద్ధం చేశారు. మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్‌‌లో కొంతభాగం ఆక్రమించిందే. దాంతో ఆ నిర్మాణాలను అధికారులు కూల్చి వేస్తున్నారు.హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) ను ఏర్పాటు చేసింది.

Hydra ఏంటి తేడా..

రీసెంట్‌గా హైడ్రా అధికారులు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. చెరువును ఆక్రమించి కట్టారని, ఆమేరకు కట్టడాలను నేలమట్టం చేసింది. మొత్తం 10 ఎకరాల్లో 2015లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. ఇందులో 1.12 ఎకరాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయి. 2 ఎకరాలు బఫర్ జోన్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇదే అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దాంతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఎఫ్‌టీఎల్ అంటే.. చెరువు లేదంటే జలాశయంలో పూర్తిస్థాయి నిల్వ సామర్థ్య పరిధిని ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) అంటారు. వర్షాకాలంలో నీటితో నిండితే లేదంటే వరద నీటితో నిండితే ఎఫ్‌టీఎల్ నిర్ధారిస్తారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో పట్టా భూములు ఉన్నా సరే.. నీళ్లు లేని సమయంలో వ్యవసాయం చేసుకోవచ్చు. నీరు ఉంటే ఆ భూములను వదిలేయాల్సి ఉంటుంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టొద్దనే కఠిన నిబంధన ఉంది.

Hydra ఎఫ్‌టీఎల్‌ బ‌ఫ‌ర్ జోన్‌ల‌కి తేడా ఏంటి హైడ్రా వాటిని కూల్చ‌డానికి కార‌ణాలు ఏంటి

Hydra : ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్‌ల‌కి తేడా ఏంటి.. హైడ్రా వాటిని కూల్చ‌డానికి కార‌ణాలు ఏంటి ?

బ‌ఫర్ జోన్ అంటే.. నది పరీవాహక ప్రాంతంలోకి వరదనీరు సక్రమంగా వస్తూనే.. కలుషితం కాకుండా ఉండాలి. ప్రతి నీటి వనరును, విస్తీర్ణం ఆధారంగా బఫర్‌జోన్‌‌గా నిర్ధారిస్తారు. 25 హెక్టార్లు, అంతకుమించి విస్తీర్ణంలో ఉన్న చెరువు, జలాశయాలు బఫర్‌జోన్‌ నిర్ధారణకు 30 మీటర్లను ప్రామాణికంగా తీసుకుంటారు. జంట జలాశయాల పరిధి చుట్టూ ఎఫ్‌టీఎల్‌ను ఆనుకొని 30 మీటర్లు (వంద ఫీట్లు) బఫర్‌జోన్‌గా ఉంది. ఇక్కడ సాగు సంబంధిత కార్యకలాపాలు మాత్రమే చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు చేపట్టొద్దని నిబంధనల్లో స్పష్టంగా ఉంది. నాగార్జున ఎన్ కన్వెక్షన్‌లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ రెండు ఉన్నాయి. ఆ క్రమంలోనే హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది