Kotha Prabhakar Reddy : ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు.. షాక్‌లో కేసీఆర్
Kotha Prabhakar Reddy : దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది. ఆయనపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బీఆర్ఎస్ లో కలకలం లేచింది. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఎన్నికల ప్రచారంలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కొత్త ప్రభాకర్ రెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి […]
ప్రధానాంశాలు:
కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తి
కడుపులో తీవ్రగాయం
దాడి చేసిన వ్యక్తిని చితకబాదిన బీఆర్ఎస్ కార్యకర్తలు
Kotha Prabhakar Reddy : దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది. ఆయనపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బీఆర్ఎస్ లో కలకలం లేచింది. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఎన్నికల ప్రచారంలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కొత్త ప్రభాకర్ రెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి.
వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కడుపులో పొడవగా.. ఆయనకు తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది. సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొన్ని రోజుల నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజీగా ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గం తిరుగుతున్నారు. ఇవాళ దౌల్తాబాద్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే పట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అతడిని చితకబాదారు. వెంటనే ప్రభాకర్ రెడ్డిని కారులో ఆసుపత్రికి తరలించారు. తన కడుపులో పొడవడంతో కడుపు నుంచి తీవ్రంగా రక్తస్రావం అయింది. కడుపుకు గట్టిగా ఒక క్లాత్ కట్టి వెంటనే ప్రభాకర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఆయనపై దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలియలేదు. ఆ వ్యక్తి ఎవరో తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి . pic.twitter.com/kQNiXQKGaG
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2023
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి చేసిన వ్యక్తిని చితకబాదిన కార్యకర్తలు. pic.twitter.com/jnGjOuIhTo
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2023