Business Idea : రూ.50వేల పెట్టుబడితో లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియా మీకోసం..!
Business Idea : చాలా మందికి ఈ రోజుల్లో ఉద్యోగం చేయడం కంటే వ్యాపారం చేయాలని ఉంటుంది. కానీ అందుకు సరిపడా పెట్టుబడి లేకపోవడంతో సతమతం అవుతుంటారు. కొందరు కుటుంబీకులు, స్నేహితులు, బంధువుల నుంచి ఆర్థిక సాయం పొంది వ్యాపారం ప్రారంభిస్తుంటారు.మరికొందరు తమ డిగ్రీ ధృవపత్రాలను చూపి బ్యాంకుల నుంచి రుణం పొందాలనుకుంటారు. కానీ అందుకోసం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. డబ్బులు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. వ్యాపారం చేయాలని కోరిక ఉండి తక్కువ పెట్టుబడిలో ఎక్కువ ఆదాయం సంపాదించాలనే కోరిక ఉన్నవారు ఈ బిజినెస్ ఐడియా తెలుసుకుంటే త్వరగా డబ్బులు సంపాదించడంపై దృష్టి సారించవచ్చు.
ఎందుకంటే ఇది సీజన్‌లో మాత్రమే దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ సంపాదించుకునే తెలివి ఉంటే సంవత్సరానికి సరిపడా డబ్బులు ఒకే సారి సంపాదించుకోవచ్చు. వెడ్డింగ్ ప్లానర్స్.. ప్రస్తుతం వీరికి మార్కెట్లో డిమాండ్ చాలా ఉంది. చాలా తక్కువ టైంలో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు నేటితరం యువతీయువకులు. ఒకప్పటి లాగా ఐదు రోజుల పెళ్లి, బంధువులు అందరిని పిలిచి సందడిగా చేసుకునేంత టైం ఎవ్వరికీ లేదు. టైం ఈజ్ మనీ అంటున్నారు అమ్మాయి అబ్బాయి. అందుకే అంతా రెడీమేడ్ అయిపోయింది. పెళ్లి మండపం దగ్గరి నుంచి భోజనాల వరకు అంతా వెడ్డింగ్ ప్లానర్స్‌కు అప్పగించేస్తున్నారు.
Business Idea : చిన్న పెట్టుబడితో లక్షల్లో ఆదాయం..
ఎంతమంది బంధువులు వస్తారు. ఫుడ్ ఎంత కావాలి. వాళ్ల రీసివింగ్ ఇలా అన్ని వారే చూసుకుంటున్నారు. పెట్టుబడి ఎక్కువగా ఉన్నవారు రిచ్‌గా దీనిని నిర్వహించుకోవచ్చు. తక్కువగా ఉన్నవారు రూ.50వేలతో ప్రారంభించి నెమ్మదిగా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ముందుగా ఒకటి రెండు ఆర్డర్స్ తీసుకుని అందులో కాస్త ఎక్స్ పీరియన్స్ సాధించాక ఏది ఎలా చేయాలనేదానిపై ఒక క్లారిటీ వస్తుంది. కొద్దిగా డబ్బులు కూడా మిగులుతాయి.అనంతరం నెమ్మదిగా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.వెడ్డింగ్ డెకరేషన్, క్యాటరింగ్, లైటింగ్ వంటివారితో పరిచయాలు పెంచుకుని మీరే సొంతంగా వ్యాపారాన్ని పెద్దగా చేసుకోవచ్చు.