YS Jagan : సీఎం అని చూడకుండా ల.. కొడకా అని తిడుతున్నారు .. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకూ బాగా వేడెక్కుతోంది. దూషణల పర్వం నుంచి దాడుల వరకు రాజకీయం మారింది. ఈ క్రమంలోనే టీడీపీ అధికారి ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలతో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ దాడులను ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు నిరసన దీక్ష చేస్తున్నాడు. కాగా, ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పందించారు.వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో లేదని, తమ నాయకుడు అధికారంలో లేడని చెప్పి ముఖ్యమంత్రిని ఉద్దేశించి బూతులు తిడుతున్నారని, ల.. కొడకా అని అంటున్నారని, అది కరెక్టెనా అని ఆలోచన చేయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రిని దూషించడం ద్వారా రాష్ట్రంలో సీఎంను అభిమానించే వ్యక్తులు తిరగబడి, రెచ్చిపోయి మరి ప్రజల మధ్య భావోద్వేగాలు పెరిగి, గొడవలు పెరిగేలా ఆలోచనలు చేయడం సరియేనా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలని సీఎం జగన్ టీడీపీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరిట చంద్రబాబు 36 గంటల నిరసన దీక్షలో కూర్చొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిరసనలో పాల్గొన్న చంద్రబాబు ఏపీ ప్రభుత్వ తీరుపై పలు కామెంట్స్ చేశాడు. టీడీపీని తుదముట్టించాలనే వైసీపీ వారు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
YS Jagan : ముఖ్యమంత్రిని బూతులు తిట్టడం సరియేనా అని ప్రశ్నించిన వైఎస్ జగన్..
చంద్రబాబు త్వరలో రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ దాడులపై కేంద్రం దృష్టి సారించాలని ఇప్పటికే బీజేపీ మిత్రమపక్షమైన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈ దాడుల సంస్కృతి సరికాదని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే అరాచకాలకు కేరాఫ్‌గా ఏపీ ఉండబోతుందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.