PM Modi : రైతులకు శుభవార్త.. వ్యవసాయ చట్టాలు రద్దు..
PM Modi : కార్తీక పౌర్ణమి రోజున భారత ప్రధాని నరేంద్రమోడీ రైతులకు శుభవార్త చెప్పారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న క్రమంలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు.
PM Modi : రైతుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన ప్రధాని..
శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, రైతులకు మోడీ క్షమాపణ చెప్పారు. ఈ క్రమంలోనే రైతులకు ఉపయోగపడేలా తక్కువ ధరలకే మంచి విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు.
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీలో రైతులు ఏడాది నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో అధికారంలోనున్న టీఆర్ఎస్ పార్టీ కూడా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఇందుకుగాను ధర్నాలు చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ఈ మేరకు ధర్నాలో డిమాండ్ చేశారు.