Viral Video : కాలకృత్యాల కోసం వాష్ రూమ్‌కు వెళ్లిన సింహం.. నిజమండోయ్.. !
Viral Video : సాధారణంగా మనం ఏదేని ఊర్లలోకి వెళ్లినపుడు గ్రామం బయటనే బహిరంగ మల, మూత్ర విసర్జిత రహిత గ్రామం అని బోర్డులు పెట్టి ఉంచడం మనం చూడొచ్చు. అలా బోర్డులు పెట్టడానికి గల కారణం మనకు ఆల్రెడీ అర్థమయి ఉంటుంది. ప్రతీ ఒక్కరు బాత్ రూమ్, లెట్రిన్ యూజ్ చేసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయొద్దని అర్థం. ప్రభుత్వాలు కూడా ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
అయితే, తాజాగా సింహం కూడా వాష్ రూమ్ యూజ్ చేసుకుందండోయ్.. అవునండీ మీరు చదివింది నిజమే.. నాగరికత తెలిసిన సింహం ఒకటి వాష్ రూమ్‌లోకి వెళ్లి బయటకు వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సదరు వీడియోలో లయన్ పబ్లిక్ టాయిలెట్ నుంచి బయటకు రావడం మనం గమనించొచ్చు.
రూపిన్ శర్మ అనే ఐపీఎస్ అధికారి ట్విట్టర్ వేదికగా ఈ వీడియో షేర్ చేయగా, అది నెట్టింట వైరలవుతోంది. వీడియో చూసి నెటిజన్లు ‘వెల్ మ్యానర్‌డ్ లయన్’ అని కామెంట్స్ చేస్తున్నారు. సదరు ఘటన ఇండియాలో జరగలేదని, వేరే దేశంలో జరిగిందని తెలుస్తోంది.
#Civilized #Lion walks out from #PublicToilet.????????
महाराजा शेर, #शौचालय से निकलते हुए #SwachhBharat#ODF#OpenDefecationFree @ParveenKaswan @hvgoenka pic.twitter.com/CyNQ60l3fs
— Rupin Sharma IPS (@rupin1992) October 6, 2021