YSRCP : ఆ అంచనాలు తప్పితే.. జగన్ పరిస్థితి ఏంటో మరి..?
YSRCP : 2019 సాధారణ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇక పదేళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని వైసీపీ నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో రాజకీయంగా పలు సమీకరణాలతోనే జగన్ సక్సెస్ అయ్యాడనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకునే రాజకీయంగా ముందుకు వెళ్లాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అవేంటంటే..కులాల సమీకరణాలతో ఎన్నికల్లో గెలవొచ్చు అని చాలా మంది రాజకీయ నాయకులు అనుకుంటారు. కాని అన్ని సమయాల్లో ఆ సమీకరణాలు పని చేయకపోవచ్చు. ఇందుకు బోలెడన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి.

ysrcp
జనం అప్పటి మూడ్‌ను బట్టి పోలింగ్ ఉంటుందని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం సంక్షేమ పథకాలు, కుల సమీకరణాల ఆధారంగా రాజకీయం చేయగలిగే పరిస్థితులు ఉండకపోవచ్చని అంటున్నారు. ప్రతీ రోజు ఫ్యామిలీ గడవడంతో పాటు వారి ఎకానమికల్ కండీషన్స్ మెరుగు కావాలి. అందుకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు తగు సాయం చేయాలి. అయితే, ప్రస్తుతం పరిస్థితుల్లో ఏపీలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల్లో జగన్ పాలన పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను గ్రహించి క్షేత్రస్థాయి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వైసీపీకి ఎంతైనా ఉంది. కాని ఈ క్షేత్రస్థాయి పరిస్థితులు ముఖ్యమంత్రి వరకు రీచ్ అయ్యే సిచ్యువేషన్స్ ఇప్పుడున్నట్లు కనిపించడం లేదు. పింఛన్లు, రేషన్, అమ్మ ఒడితో పాటు ఇతర సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ రీచ్ అవుతున్నాయనే రిపోర్టులు జగన్‌కు అందుతున్నట్లు కనబడుతున్నది.
YSRCP : అన్ని సార్లు అవి అండగా నిలిచేనా?

ys jagan
ఇకపోతే జగన్ సైతం తనను కులాల సమీకరాణాలతో పాటు సంక్షేమ పథకాలు రాజకీయంగా అధికారంలో ఉండటానికి సాయపడతాయని, అవే తనను గట్టెక్కిస్తాయని అంచనా వేసుకుంటున్నట్లు కనబడుతున్నది. బీసీల్లో అత్యధిక కులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వైసీపీ వైపు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో రోజురోజుకూ నియోజకవర్గాల్లో శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులపై వ్యతిరేకత పెరుగుతందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసుకుంటేనే మంచిదనే అభిప్రాయలు రాజకీయ వర్గాల నుంచి వినబడుతోంది.