ys jagan : జగన్ క్యాబినెట్‌లో చాన్స్ వీరికే..?
ys jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్.. తన క్యాబినెట్ ను విస్తరించాలని చాలా రోజుల నుంచే ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే క్యాబినెట్ విస్తరణ జరగాల్సి ఉన్నా.. బద్వేల్ బై ఎలక్షన్‌కు షెడ్యూల్ రావడంతో క్యాబినెట్ విస్తరణను పోస్ట్ పోన్ చేశారు. సంక్రాంతి వరకు క్యాబినెట్ విస్తరించాలని అనుకుంటున్నారు జగన్. ఇందులో పూర్తిగా కొత్త వారికే చాన్స్ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన పేర్లను సైతం ఆయన రెడీ చేశారని ఆ పార్టీ వర్గాల్లో టాక్.
సామాజికవర్గాల పరిగణనతో పాటుగా క్లీన్ ఇమేజ్ ఉన్న వారికే చాన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. మొదటగా కొందరి పేర్లు పరిశీలించినా… వారిపై కరప్షన్ ఆరోపణలు, పలు కేసులు ఉండటంతో అలాంటి వారిని పక్కన పెట్టేశారని తెలుస్తోంది.
ys jagan : ఎదుర్కొనే సత్తా ఉన్న వారికే..
కేబినెట్‌లో ఉన్న గుమ్మనూరి జయరాం, సురేష్ వంటి నేతలపై కరప్షన్ ఆరోపణలున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ సీబీఐ కేసు సైతం నమోదుచేసింది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులను బలంగా ఎదుర్కొనే వారికే మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారట. ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలను తెప్పించుకుని పరిశీలిస్తున్నారని తెలుస్తున్నది. వీటి ఆధారంగానే పేర్లు ఫైనల్ చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారికి ఎక్కువ స్థాయిలో కేబినెట్ లో చోటు దక్కే చాన్స్ ఉందని తెలుస్తున్నది. ఆ ప్రాంతాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది కాబట్టి ఒక వేళ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని జనసేన బరిలోకి దిగినా.. వాటిని ఎదుర్కొనేందుకు గట్స్ కలిగిన లీడర్లకే కేబినెట్ లో చాన్స్ కల్పించాలని సీఎం జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్. సామాజిక వర్గం పరంగానే కాకుండా సమర్థత ఉన్న వారికే చాన్స్ ఇవ్వాలని జగన్ డిసైట్ అయినట్టు తెలుస్తున్నది. పదవులు ఎవరికి దక్కుతాయో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.