Viral Video : పెళ్లి కూతురు మాస్ డ్యాన్స్.. ఎక్స్ ప్రెషన్స్ చూస్తే షాక్ .. వీడియో
Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో చేసే సందడి అంతాఇంతా కాదు. రెగ్యూలర్ గా వేలల్లో డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఊరమాస్ స్టెప్పులతో అందిరి ముందు డ్యాన్స్ చేస్తూ తగ్గేదేలా అంటున్నారు. ఎంగేజ్ మెంట్ మొదలు పెళ్లి పూర్తి అయ్యేవరకు ఇంటిల్లిపాద, బంధువులు, ఫ్రెండ్స్ చేసే సందడి పెళ్లికే హైలైట్ అవుతుంది. ఒకప్పటిలాగా పెళ్లికూతురు మండపంలో సిగ్గుపడుతూ కూర్చునే రోజులు పోయాయి.
తీన్మార్ స్టెప్పులు వేస్తూ ఏకంగా మండపంలోకి వస్తూనే ఆకట్టుకుంటున్నారు. మండపంలో డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తున్నారు. పెళ్లికొడుకు సిగ్గుపడుతుంటే తగ్గేదేలా అంటూ పోటీ పడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. ఇక బంజారా పెళ్లి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వయసుతో సంబంధం లేకుండా అందరూ డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తారు. బరాత్ లో అందరూ ఒక చోట చేరి డీజే ఫోక్ సాంగ్స్ కి ఊరమాస్ స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటారు.
ఇక పెళ్లికూతురు తీన్మార్ స్టెప్పులు వేస్తూ తగ్గేదేలా అనేలా డ్యాన్స్ తో ఆకట్టుకుంటుంది. ఫ్రెండ్స్ బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తారు. ప్రస్తుతం ఓ పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. పెళ్లికూతురు గెటప్ లో అమ్మాయితో కలిసి ఆరుబయట డీజే పాటలకు మాస్ స్టెప్పులు వేస్తూ అదరగొడతోంది. ఫుల్ ఎనర్జిటిగ్ గా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మతిపోగొడతోంది.