Viral Video : ఈ జంట మామూలు జోష్ లో లేరుగా… మాస్ డ్యాన్స్ తో అదరగొడుతున్న వధూవరులు
Viral Video: ప్రస్తుతం పెళ్లిలో జోష్ ఎదైనా ఉందంటే అది డ్యాన్స్ అని చెప్పవచ్చు. ఇదివరకు పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్.. బంధువులు. ఫ్యామిలీ మెంబర్స్ డ్యాన్స్ చేసేవాళ్లు పెళ్లికొడుకును, పెళ్లికూతురును డ్యాన్స్ చేయమని బలవంతపెట్టినా సిగ్గుతో చేసేవారు కాదు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ చేస్తూ అదరగొడతున్నారు. ఇతరులకు డ్యాన్స్ చేసే చాన్సే ఇవ్వట్లేదు. అట్లుంటది మనతోని.. అంటున్నరు.
ఒకప్పుడు పెళ్లి కూతురు సిగ్గుపడుతూ మండపంలో కూర్చుంటుండే. పెళ్లి అయిన వారం రోజులకు కూడా బయటకు రాకుండా సిగ్గుతో తలదించుకునేది. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్లి కూతురు మండపానికి వస్తూనే అదిరిపోయే స్పెప్పులేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.ట్రెండింగ్ సాంగ్స్ తో పెళ్లి పనులు స్టార్ట్ చేసినప్పటి నుంచి పెళ్లి సందడి అయిపోయేవరకు ఇంటిల్లిపాది డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాల్లో పాటలు హిట్ అవుతాయో లేదో తెలియదు కానీ..

Bride mass dancing in Video Viral
సోషల్ మీడియా ద్వారా వీళ్లు డ్యాన్స్ చేసిన వీడియోలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం పెళ్లికొడుకు పెళ్లికూతురు మండపం స్టేజీపై మాస్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అందంగా ముస్తాబై ఫొటోలకు ఫోజులిస్తూ డీజే సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఎలాంటి జంకు లేకుండా వాళ్లపనిలో వాళ్లున్నారు. దీంతో సోషల్ మీడియా ఇన్ స్టాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఆ మాస్ స్టెప్పులను చూసి ఎంజాయ్ చేయండి.
View this post on Instagram