Viral Video : బ్రిలియంట్ ‘క్యాట్.. మసాజ్’.. చూస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : బ్రిలియంట్ ‘క్యాట్.. మసాజ్’.. చూస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో..!

 Authored By mallesh | The Telugu News | Updated on :14 January 2022,5:30 pm

Viral Video : సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరలవుతుంటాయి. ముఖ్యంగా పెట్ యానిమల్స్ చేసే విన్యాసాలు చూసి నెటిజన్లు ఆనందపడిపోతుంటారు. ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట బాగా వైరలవుతోంది. సదరు వీడియలో పిల్లి ఏం చేస్తోందంటే..నెట్టింట వైరవలవుతున్న సదరు వీడియోలో క్యాట్ యువతికి చక్కగా మసాజ్ చేస్తోంది.

గుల్దర్ బకాలిమ్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో క్యాట్ ఎంచక్కా హాయిగా.. యువతి నడుము పై నుంచి భుజాల వరకు వస్తుండటం మనం చూడొచ్చు. యువతి బోర్లా పడుకుని ఉండగా, క్యాట్ అలా యువతి బ్యాక్ పై నడుచుకుంటూ వచ్చి.. భుజం వద్ద మసాజ్ చేస్తోంది.భుజంపైన తన ముందరి రెండు కాళ్లతో చక్కగా తొక్కుతూ మసాజ్ చేస్తోంది. అలా లెఫ్ట్ భుజంపైన మసాజ్ చేసిన అనంతరం క్యాట్ రైట్ సైడ్ భుజం వైపునకు వెళ్తోంది.

cat massage video viral in internet

cat massage video viral in internet

Viral Video : క్యాట్ స్పెషల్ మసాజ్..!

అలా హ్యాపీగా క్యాట్ మసాజ్ చేస్తోంది. అయితే, ఇలా మసాజ్ చేయించడం పిల్లికి తన యజమాని నేర్పించి ఉండొచ్చని, అందుకే అలా పిల్లి చక్కగా మసాజ్ చేస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే పిల్లి అలా మసాజ్ చేస్తుండగా యువతి చాలా హ్యాపీగా ఫీలవుతోంది. పిల్లి వెరీ గుడ్ ఎక్స్ ప్రెషన్స్ తో చాలా క్యూట్ గా ఉందని మరి కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది