Viral Video : బెలూన్ తో ఫుట్ బాల్ ఆడేస్తున్న పిల్లి.. ఇది వేరే లెవల్..
Viral video : ఇంట్లో కుక్కలు లేదంటే పిల్లుల్ని పెంచుకోవడం అనేది ఈ కాలంలో సర్వ సాధారణం అయిపోయింది. ఒకప్పుడు పిల్లుల్ని పెద్దగా పెంచుకునే వారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది తమ ఇండ్లలో పిల్లుల్ని పెంచుకుంటున్నారు. మరి చిన్నప్పటి నుంచే మనుషుల మధ్య ఉండటమో ఏమో తెలియదు గానీ.. పిల్లులు కూడా చాలా అప్ డేట్ అయిపోతున్నాయండోయ్. అవి కూడా అచ్చం మనుషుల్లాగే అనేక పనలు చేస్తున్నాయి.
ఆటలు ఆడటం దగ్గరి నుంచి టీవీ చూడటం, సెల్ ఫోన్ చూడటం లాంటివి కూడా చేసేస్తున్నాయి.ఇలా పిల్లులు చేస్తున్న అల్లరి పనులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో అనేకం వైరల్ అవుతూనే ఉంటాయి. కాగా ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వైరల్ వీడియోనే తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో ఓ పిల్లి ఏకంగా ఫుట్ బాల్ ఆడేస్తోంది. టీవీఓ తెగ చూసి అలవాటు అయిందో ఏమో తెలియదు గానీ.. ఓ బ్లూ కలర్‌లో ఉండే బెలూన్ ను తన కాళ్ల నడుమ వేసుకుని నడుచుకుంటూ వెళ్తోంది.

Viral video cat playing football with a balloon its a different level
Viral video : అచ్చం ఫుట్ బాల్ ఆడినట్టే..
అచ్చం ఫుట్ బాల్ లో కాళ్లతోనే ఫుట్ బాల్‌ను ఆడుకుంటూ వెళ్లినట్టు.. ఆ బాల్‌ను బయటకు పోనివ్వకుండా అది మెయింటేన్ చేస్తూ తన్నుకుంటూ పోతున్నట్టు కనిపిస్తోంది.అయితే ఆ బాల్ అనుకోకుండా అలా పడిందా.. లేక పిల్లి నిజంగానే బాల్ తో అలా ఆడుకుంటుందా అనేది మాత్రం తెలియదు. కాకపోతే వీడియో మాత్రం నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది.
https://twitter.com/buitengebieden_/status/1486123385923018761