Viral Video : వావ్.. వాట్ ఏ డాగ్.. యజమానితో కలిసి పుష్ అప్స్.. ఎక్సర్ సైజెస్.. వీడియో
Viral Video : జనరల్‌గా విశ్వాసానికి ప్రతీక అయిన జంతువు ఏది అని ఎవరిని అడిగినా అందరూ దాదాపుగా చెప్పే పేరు ‘కుక్క’. డాగ్..ఒకసారి యజమానిని ప్రేమిస్తే అది తన బాధ్యతను నిర్విర్తిస్తూనే ఉంటుంది. అలా శునకం ఎప్పుడూ తన యజమాని గురించి ఆలోచిస్తుంటుంది. ఈ సంగతి అలా ఉంచితే.. శునకం తన యజమానితో పాటు చేసిన ఓ విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
ఇంతకీ సదరు డాగ్ ఏం చేసిందంటే..యోక్ ఆర్తిక్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో డాగ్ యజమాని చేసిన మాదిరిగా తాను పుషప్స్ చేస్తోంది. పెట్ డాగ్ ఓనర్ వన్..టూ.. త్రీ అని అంటూ తాను కడెంను పట్టుకుని పుష్ అప్స్ చేస్తున్నాడు. ఆయనను అనుకురిస్తూ పెట్ డాగ్ కూడా పుష్ అప్స్ చేస్తోంది. అది చూసి నెటిజన్లు సంబురపడిపోతున్నారు.

dog doing push ups In video viral
Viral Video : యజమానిని అనుకరిస్తూ.. డాగ్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్..
బుల్లి కుక్కపిల్ల తన యజమానిని అనుకరిస్తూ అలా పుషప్స్, ఎక్సర్ సైజెస్ చేస్తుండటం వెరీ నైస్ అని అంటున్నారు. ఈ మేరకు నెటిజన్లు పోస్టులు కూడా పెడుతున్నారు. వావ్..వాట్ ఏ డాగ్ అని కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. క్యూట్ డాగ్ అలా హ్యాపీగా తన ఓనర్‌తో పాటు తాను కూడా ఫిట్ నెస్ గోల్స్ రీచ్ అవుతున్నదని, వెరీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ డాగ్ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Yok artık köpek şınav çekiyor ????????♥️ pic.twitter.com/ppHf4CQe7i
— yok artık (@yokartik_ya) January 13, 2022