Viral Video : వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శునకం.. ఆ ఫీట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శునకం.. ఆ ఫీట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Viral Video : విశ్వాసానికి మరో పేరు ఏదైనా ఉందంటే అది శునకాలే. ఈ మాట ఎవరిని అడిగినా చెబుతారు. ఈ రోజుల్లో కొందరు మనుషులతో ఉండటం మానేసి శునకాలతో దోస్తీ చేస్తున్నారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేవారు ముఖ్యంగా కుక్కలతో అప్యాయంగా ఉంటున్నారని తెలిసింది. మనం ఇంట్లో పెంచుకునే పెట్స్ అన్నింటిలోనూ శునకాలు చాలా బెటర్. వీటికి మెమోరీ పవర్ కూడా చాలా ఉంటుంది. తమ యాజమానులు చెప్పింది గుర్తుపెట్టుకుని మరీ చేస్తుంటాయి. కొందరు ఉదయాన్నే తమ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :31 January 2022,6:00 am

Viral Video : విశ్వాసానికి మరో పేరు ఏదైనా ఉందంటే అది శునకాలే. ఈ మాట ఎవరిని అడిగినా చెబుతారు. ఈ రోజుల్లో కొందరు మనుషులతో ఉండటం మానేసి శునకాలతో దోస్తీ చేస్తున్నారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేవారు ముఖ్యంగా కుక్కలతో అప్యాయంగా ఉంటున్నారని తెలిసింది. మనం ఇంట్లో పెంచుకునే పెట్స్ అన్నింటిలోనూ శునకాలు చాలా బెటర్. వీటికి మెమోరీ పవర్ కూడా చాలా ఉంటుంది. తమ యాజమానులు చెప్పింది గుర్తుపెట్టుకుని మరీ చేస్తుంటాయి. కొందరు ఉదయాన్నే తమ పెంపుడు జంతువులను తీసుకుని వాకింగ్ చేస్తుంటారు. ఆ టైంలో ఏదైనా ప్రమాదం సంభవించేలోపు శునకాలు విపత్తు నుంచి వారిని రక్షిస్తాయి.

ఎందుకంటే మనిషి బ్రెయిన్ కంటే వాటి బ్రెయిన్ విపత్తులను త్వరగా గుర్తిస్తుంది.సాధారణంగా మనం ఇంట్లో పెంచుకునే శునకాల కంటే బయట తిరిగేవి, పోలీసు, ఆర్మీ వంటి రంగాలతో పాటు ఆటల్లో పాల్గొనే కుక్కలు చాలా తెలివిని ప్రదర్శిస్తుంటాయి. ఎందుకంటే అవి ట్రెనింగ్ పొందుతాయి. పోలీసుల దగ్గర ఉండే శునకాలు క్లూ టీములకు సాయం చేస్తుంటాయి. వాసన ద్వారా పేలుడు పదార్థాలు, నేరస్తులను పట్టుకోవడంలో చాలా సాయం చేస్తుంటాయి. ఆర్మీలో ట్రైనింగ్ పొందిన శునకాలు ఇంకా చాలా షార్ప్‌గా ఉంటాయి. భూమిలో పాతిపెట్టిన బాంబులతో పాటు ఉగ్రవాదుల కదలికలను కూడా గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి.

dog who created the world record should to see Viral Video

dog who created the world record should to see Viral Video

Viral Video : డిస్క్ క్యాచర్ డాగ్

ఇక విదేశాల్లో కుక్కలకు స్పోర్ట్స్ నిర్వహిస్తుంటారు.రన్నింగ్, డిస్క్ క్యాచర్, బాల్ క్యాచర్, స్విమ్మింగ్ వంటి పోటీలను కూడా నిర్వహిస్తుంటారు. తాజాగా ఫైజిన్ అనే యువతి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డిస్క్ క్యాచర్ గేమ్స్‌లో పాల్గొన్న ఓ కుక్క చాలా వేగంగా పరిగెత్తి ప్లాస్టిక్ డిస్క్‌ను తన నోటితో కరిచి పట్టుకుని తిరిగి వచ్చింది. దాని వేగాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ఈ డాగ్ వండర్ అని కొందరు మాట్లాడుకుంటున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది