Viral Video : ఓవైపు జోరు వాన.. మరోవైపు రోడ్ల పక్కన చెట్లకు నీళ్లు పెడుతున్న సిబ్బంది.. ఎక్కడో తెలుసా? వైరల్ వీడియో
Viral Video : గత వారం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశమంతా తడిసి ముద్దవుతోంది. జోరుగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు జనాలు కూడా ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చెరువులను తలపిస్తున్నాయి. చెరువులు, కుంటలు అన్నీ నిండిపోయి మత్తడి దుంకుతున్నాయి. రవాణా ఎక్కడికక్కడ ఆగిపోయింది. రోడ్ల మీది నుంచి వరదలు పొంగి పొర్లుతుండటంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. ఇంకో మూడు నాలుగు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా గత వారం రోజుల నుంచి జోరుగా వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. నగరమంతా తడిసి ముద్దయిన విషయం కూడా తెలిసిందే. అయినప్పటికీ జీహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ ట్యాంకర్ తో హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఉన్న చెట్లకు నీళ్లు పెడుతున్నారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ghmc staff watering to the trees in hyderabad video viral
Viral Video : చెట్లకు నీళ్లు పెట్టిన జీహెచ్ఎంసీ సిబ్బంది
ఇదే వీడియోను ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఎంత సిన్సియర్ గా వాళ్లకు అప్పజెప్పిన డ్యూటీని చేస్తున్నారు అంటూ ఆ వీడియోను ట్వీట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫూలిష్ నెస్ కాకపోతే భారీ వర్షాలు కురుస్తున్నా చెట్లకు నీళ్లు పెట్టడం ఎందుకు.. జీహెచ్ఎంసీ సిబ్బంది కావాలంటే సహాయక చర్యల్లో సిన్సియర్ గా పనిచేయండి.. భారీ వర్షాలకు సమస్యలో చిక్కుకున్న వాళ్లకు సాయం చేయండి.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Couldn't get over this one: Come #Rain or #Shine, #GHMC believes in sincerely doing assigned duty #WeAreLikeThisOnly @ndtv @ndtvindia pic.twitter.com/P599lHgCyf
— Uma Sudhir (@umasudhir) July 12, 2022