Viral Video : ప్రకాశం జిల్లాలో వింత.. చెట్లు నరుకుతుండగా.. చెట్టు నుంచి మంచినీళ్లు వీడియో వైరల్..!!
Viral Video : దేశ అభివృద్ధి చెందుతున్న గాని చాలా ప్రాంతాలలో తాగునీరు సమస్య ఇంకా ప్రజలను పట్టిపీడిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాలలో బతికే ప్రజలు.. తాగునీరు కోసం అనేక కష్టాలు ఇప్పటికీ పడుతున్నారు. మరోపక్క అభివృద్ధి పేరిట ప్రకృతిని ప్రభుత్వాలు నాశనం చేసేస్తున్న దాఖలాలు చాలా సందర్భాలలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో చాలా చోట్ల చెట్లు నరికేస్తున్నారు.
పట్టణాలలో ఇంకా అడవులలో సైతం చెట్లను నరికేస్తున్నారు. భారీగా పెరిగిన వృక్షాలను సైతం వదలకుండా నరకటం బాధాకరం. ఈ రకంగానే ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజు టూరు గ్రామం అటవీ ప్రాంతంలో చెట్లు నరుకుతుండగా చెట్టు నుంచి మంచినీళ్లు రావటంతో ఆ చెట్టును చూడటానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా వెళ్తున్నారు. ఇదే సమయంలో ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను కూడా తాగుతున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా లోతులలో బావులు తవ్వితే గాని నీరు ఒకని పరిస్థితులలో చెట్టు.. మొదల నుండి ట్యాప్ రూపంలో ధారాళంగా నీరు రావడం ఆ ప్రాంత ప్రజలను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది. అటవీ ప్రాంతంలో జరిగిన ఈ వింత చూడటానికి ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సైతం ఆ చెట్టు వద్దకు తండోపతండాలుగా వస్తున్నారు…
చెట్లు నరుకుతుండగా వింత ఘటన
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామం అటవీ ప్రాంతంలో చెట్లు నరుకుతుండగా చెట్టు నుంచి మంచినీళ్లు రావడంతో ఆ చెట్టును చూడడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా వెళ్తున్నారు. ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను కూడా తాగుతున్నారు. pic.twitter.com/hpGe1Yfwwc
— Telugu Scribe (@TeluguScribe) August 3, 2023