Fashion Show : టీచ్ ఫర్ ఛేంజ్ ఫ్యాషన్ షోలో మెరిసిన తారలు.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ..!
Fashion Show : ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి ఆధ్వర్యంలో ‘ టీచ్ ఫర్ చేంజ్ ‘ ఫ్యాషన్ షో చాలా గ్రాండ్ గా జరిగింది. పేద విద్యార్థుల చదువులకు నిధుల సమీకరణ కోసం ప్రతి సంవత్సరం టీచ్ ఫర్ ఛేంజ్ ఫ్యాషన్ షో నిర్వహిస్తారు. తాజాగా మరోసారి ఈ షో ఆకట్టుకుంది. ఈ ఫ్యాషన్ షో ద్వారా వచ్చే వార్షిక నిధులను పేద పిల్లల చదువులకు ఖర్చు చేస్తుంటారు. అయితే ఈసారి ఈ షో స్టాపర్లుగా […]
ప్రధానాంశాలు:
Fashion Show : టీచ్ ఫర్ ఛేంజ్ ఫ్యాషన్ షోలో మెరిసిన తారలు.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ..!
Fashion Show : ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి ఆధ్వర్యంలో ‘ టీచ్ ఫర్ చేంజ్ ‘ ఫ్యాషన్ షో చాలా గ్రాండ్ గా జరిగింది. పేద విద్యార్థుల చదువులకు నిధుల సమీకరణ కోసం ప్రతి సంవత్సరం టీచ్ ఫర్ ఛేంజ్ ఫ్యాషన్ షో నిర్వహిస్తారు. తాజాగా మరోసారి ఈ షో ఆకట్టుకుంది. ఈ ఫ్యాషన్ షో ద్వారా వచ్చే వార్షిక నిధులను పేద పిల్లల చదువులకు ఖర్చు చేస్తుంటారు. అయితే ఈసారి ఈ షో స్టాపర్లుగా శృతిహాసన్, శ్రియా సరన్, హర్షవర్ధన్ రాణే తో పాటు ప్రముఖ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వంటి ప్రముఖులు కూడా ఈ ఫ్యాషన్ షో కి ర్యాంప్ వాక్ చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు వార్షిక నిధులు సమీకరణ కోసం ఫిబ్రవరి 11న 9వ ఎడిషన్ మంచు లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.
స్టార్ స్టడెడ్ సెలబ్రిటీస్ ఫ్యాషన్ షో తో ఈసారి నగరవాసులను కళ్ళు చెదిరేలా షో ఆకట్టుకుంది. ఈ ఈవెంట్లో మహిళల దుస్తుల కోసం ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్స్ అమిత్ జీటీ, పురుషుల దుస్తుల కోసం శశాంక్ చెల్మిల్లా రూపొందించిన డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి సిద్ధార్థ ఫైన్ జువెలర్స్ ఆభరణాలను స్పాన్సర్ చేసింది. టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల కోసం ప్రముఖులు సినీ రంగనటీనటుల భాగస్వామ్యంతో ముందుకు వెళుతుంది. ఇందులో నగరానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులు హాజరై తమ వంతు సహాయాన్ని అందిస్తూ నాణ్యమైన మెరుగైన విద్యకు సహాయంగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయం సంస్థ అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించబడుతుంది.
ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపేందుకు ఈ సంస్థ ముందుకెళుతుంది. ఈ షోలో ఫరియా అబ్దుల్లా, సీరత్ కపూర్, అవంతిక మిశ్రా, లేఖా ప్రజాపతి, రాశి సింగ్, అలేఖ్య హారిక, అశోక్ గల్లా, అక్షర గౌడ, ప్రదీప్ మాచిరాజు, శృతిహాసన్, విరాజ్ అశ్విన్, సురభి, శ్రియాసరన్, మెహ్రిన్ , హర్షవర్ధన్ రాణే, యాంకర్ వర్షిని సౌందర రాజన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుధీర్ బాబు, అజిత్, శివ కందుకూరి, బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, నోవాటెల్ జనరల్ మేనేజర్ రాబిన్ తో పాటు తెలంగాణ రాష్ట్ర రహదారులు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.